వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెగా ఫ్యాన్స్‌కు బంపరాఫ‌ర్ : మోహ‌న్‌బాబుకు పోటీగా చిరంజీవి: ప‌వన్‌కు స్థానం ద‌క్కలేదా ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Chiranjeevi Ready To Start International Schools In Telugu States || Oneidia Telugu

మెగాస్టార్ అభిమానుల‌కు ఇది గుడ్ న్యూస్‌. చిరంజీవి అభిమానుల పిల్ల‌ల‌కు అత్యుత్తమ విద్య చౌకగా అందుబాటులోకి వ‌స్తోంది. చిరంజీవి ఇప్ప‌టి వ‌ర‌కు బ్ల‌డ్ బ్యాంకు ద్వారా సేవలు అందిస్తున్నారు. తాజాగా, విద్యారంగంలోకి అడుగు పెట్టాల‌ని నిర్ణ‌యించారు. ఇందుకు ఏపీలోని వెనుక బ‌డిన ప్రాంత‌మైన శ్రీకాకుళం నుండి ప్రారంబించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. తెలుగు సినీ రంగంలో ఇప్ప‌టికే మోహ‌న్‌బాబు విద్యా రంగంలో ముందున్నారు. ఇక‌, ఈ కొత్త నిర్ణ‌యం లో అనేక కొత్త కోణాలు ఉన్నాయి.

వ‌చ్చేది హంగ్.. మేమే కింగ్‌: ప‌వ‌న్ క‌ల్యాణ్‌!వ‌చ్చేది హంగ్.. మేమే కింగ్‌: ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

విద్యారంగంలోకి చిరంజీవి ఫ్యామిలీ..

విద్యారంగంలోకి చిరంజీవి ఫ్యామిలీ..

ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా రంగం..సేవా రంగాల్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కొత్త రంగంలోకి అడుగు పెడుతున్నారు. త‌న స‌హ‌చ‌రుడు..మోహ‌న్‌బాబు త‌ర‌హాలో విద్యా రంగంలోనూ సేవా కార్య‌క్ర‌మాలు అందించాల‌ని నిర్ణ‌యించారు. దీని కోసం భారీ స్థాయిలో చిరంజీవి ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్స్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్దం చేసారు.ఇందు కోసం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో తొలుత ప్రారంభించాని నిర్ణ‌యించారు. చిరంజీవి పేరుతోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో అధునాతన సౌకర్యాలు, ఏసీ వసతులతో క్యాంపస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. జూన్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తున్నారు. నర్సరీ నుంచి గ్రేడ్ 5 వరకు ఐజిసిఎస్ఈ, సీబీఎస్ఈలలో తరగతులు నిర్వహించ‌నున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూళ్ల స్థాయిలో అన్ని ఏర్పాట్లు ఈ స్కూళ్ల‌లో కూడా అందుబాట‌లోకి తీస‌కొస్తున్నారు.

మెగా అభిమానుల‌కు రాయితీలు..

మెగా అభిమానుల‌కు రాయితీలు..

ఇక్క‌డ చ‌దువుకొనే విద్యార్ధులకు అధునాత‌న విద్యలో అనుభ‌వం ఉన్న ఉపాధ్యాయుల‌ను ఎంపి చేసుకుంటున్నారు. ఈ స్కూల్స్‌కు చిరంజీవి గౌర‌వ ఫౌండ‌ర్‌గా ఉంటారు. రాం చ‌ర‌ణ్ అన్ని బాధ్య‌తలు ప‌ర్య‌వేక్షిస్తూ గౌర‌వ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తారు. పెద్ద సోద‌రుడు నాగ‌బాబు గౌర‌వ ఛైర్మ‌న్‌గా కొన‌సాగ‌నున్నారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు గౌరవ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు

అయితే, మ‌రో త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మాత్రం ఇందులో ప‌ద‌వి ఉన్న‌ట్లు..స్కూల్ బాధ్య‌త‌లు ఇస్తున్న‌ట్లు ఎటువంటి సమాచారం లేదు. ఇక‌, ఈ స్కూల్‌లో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల పిల్ల‌ల‌కు ఫీజు రాయితీలు ఇవ్వాలని నిర్ణ‌యించారు. ఇది నిజంగా వెనుక బ‌డిన ప్రాంతాల్లో ఉన్న చిరంజీవి పిల్ల‌ల‌కు మంచి అవ‌కాశంగా చెబుతున్నారు.

English summary
Megastar Chiranjeevi ready to start international schools in his family management in rural areas across AP and Telangana. Decided to give concession for his fans in rural areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X