వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాధపడ్డా, రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా అన్పించింది: చిరు, ఆ డైలాగ్ ఎవరికంటే..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఖైదీ నెంబర్ 150 సినిమా రేపు (బుధవారం) విడుదల కానున్న నేపథ్యంలో నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సాక్షిలో ఎమ్మెల్యే, నటి రోజా ఆయనను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా రోజా అడిగిన ప్రశ్నలకు చిరంజీవి సమాధానం చెప్పారు.

రాజకీయాల్లో ఇమడలేరా.. కాదు, నిలబడతాడు: పవన్‌పై చిరు, ఎప్పుడు పిలిచినా.. రాజకీయాల్లో ఇమడలేరా.. కాదు, నిలబడతాడు: పవన్‌పై చిరు, ఎప్పుడు పిలిచినా..

ఖైదీ నెంబర్ 150 సినిమా రైతుల గురించి ఉందని, అందులో సమస్యల పైన పోరాడటమేనా లేక ఏమైనా పరిష్కారం చెప్పారా అని రోజా అడిగారు.

chiranjeevi

దానికి చిరంజీవి స్పందించారు. సమస్యలపై పోరాడటమే కాదు, పరిష్కారం చూపించామన్నారు. అమరావతిలో మూడు పంటలు పండే భూమి తీసుకున్నారన్నారు. పంటలు పండే భూమి, నీరు పుష్కలంగా ఉన్నచోట భూములు తీసుకుంటున్నారన్నారు. రైతులు బాగుంటే మనం బాగుంటామన్నారు.

చిరంజీవి, బాలయ్యల సినిమాలు: ఆ షోలకు అనుమతి లేదు!చిరంజీవి, బాలయ్యల సినిమాలు: ఆ షోలకు అనుమతి లేదు!

ఓ సమయంలో రోజా మాట్లాడుతూ.. రాజకీయాల్లో డిగ్నిఫైడ్‌గా ఉండాలన్నారు. అన్నీ ఆలోచించి చేయాలన్నారు. చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా ఎంజాయబుల్ అని, రాజకీయం మాత్రం టెన్షన్‌తో కూడుకున్నదని అభిప్రాయపడ్డారు.

రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా అనిపించింది

రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా? ఎందుకు ఇన్ని మాటలు పడాల్సి వస్తుందా? అని ఎప్పుడైనా అనిపించిందా అని రోజా అడిగారు. దానికి చిరంజీవి స్పందించారు.

నిజంగా చెప్పాలంటే ఆ థాట్ వచ్చిందన్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమా వేడుకల సందర్భంగా అభిమానుల హంగామా చూశాక ఆ ఆలోచన వచ్చిందన్నారు. కానీ రాజకీయంగా ప్రజలకు చేసే సేవలో తృప్తి ఉంటుందన్నారు.

chiranjeevi

చిరంజీవిని బాధపెట్టిన ఇష్యూ..

రాజకీయాల్లోకి వచ్చాక తనను చాలా బాధపెట్టిన ఇష్యూ ఉందని చిరంజీవి చెప్పారు. విభజన సమయంలో తనవంతుగా సిన్సియర్‌గా.. విభజన జరిగితే ఎన్ని కష్టాలు ఉంటాయో వివరించానన్నారు. తమకు ప్యాకేజీ కావాలని అడిగానన్నారు. అలా కాదంటే, చివరి ప్రయత్నంగా కేంద్రపాలిత ప్రాంతం అడిగానని చెప్పారు.

ఇంత ప్రయత్నాలు చేసినా, కొందరు మాత్రం విభజన సమయంలో మీరేం చేశారని నన్ను అంటున్నారని, కొందరు అవాకులు, చెవాకులు పేలుతున్నారని, అలాంటప్పుడు బాధ అనిపించిందన్నారు.

చిరంజీవి సినిమాపై చంద్రబాబు కుట్ర!: రాజకీయ రంగు.. నిజాలేమిటి?చిరంజీవి సినిమాపై చంద్రబాబు కుట్ర!: రాజకీయ రంగు.. నిజాలేమిటి?

ప్రజల్లో తనను కించపరిచే వ్యాఖ్యలు చేయడం బాధించిందన్నారు. తాను విభజన సమయంలో అంత చేసినా అనడం ఏమిటన్నారు. తాను అంత చేసినా.. కొందరు కావాలని గాజులు, చీరలు తీసుకెళ్లి తన ఇంటి ముందు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో అసభ్యకర ఫ్లెక్సీలు పెట్టడం చూసి బాధపడ్డానన్నారు. అప్పుడు ఒకింత నిర్వేదం కలిగిందన్నారు. అయితే, ఇలాంటి వాటికి బెదరకూడదని మళ్లీ అనుకున్నానని చెప్పారు.

ఆ డైలాగ్ ఎవరికి?

ఖైదీ నెంబర్ 150లో ఓ డైలాగ్ ఉందని, ఆ పంచ్ పొలిటికల్ ఎనిమీస్‌ను ఉద్దేశించా లేక సినిమాలోని విలన్లకా అని రోజా అడిగారు. దానికి చిరంజీవి మాట్లాడుతూ.. విలన్లకని చెప్పారు. ఎనిమీస్‌కు అన్నట్లుగా ఉందని రోజా బదులిచ్చారు.

English summary
Chiranjeevi felt very sad when opposition party leaders targetted him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X