తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాంచరణ్ ‘ట్రూజెట్‌’ విమానానికి చిరంజీవి పూజలు

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయంలో శనివారం సాయంత్రం ‘ట్రూజెట్‌' విమానానికి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవి పూజలు నిర్వహించారు. చిరంజీవి తనయుడు, సినీనటుడు రామ్‌చరణ్‌ ‘ట్రూజెట్‌' సంస్థలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో చిరంజీవి దంపతులు, కుమార్తెలు సుస్మిత, శ్రీజ, అల్లుడు, మనవరాళ్లు, వియ్యంకులు మొత్తం 30 మంది శనివారం ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.

Chiranjeevi have been worshiped for Trujet flights

ఇక్కడ్నుంచి తిరుమల చేరుకుని మధ్యాహ్నం శ్రీవారిని దర్శించుకున్నారు. అతిథిగృహంలో స్వల్ప విరామానాంతరం మధ్యాహ్నం 3.45 గంటలకు తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.

ఆ తర్వాత కుటుంబసభ్యులు, ట్రూజెట్ సంస్థ ఎండీ ఉమేష్‌ తదితరులతో కలిసి ‘ట్రూజెట్‌' విమానానికి పూజలు చేశారు. శనివారం సాయంత్రం అదే విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. కాగా, ఆదివారం(జులై12) నుంచి ఈ విమాన సర్వీసు హైదరాబాద్‌- తిరుపతి మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి.

English summary
Famous Actor and MP Chiranjeevi have been worshiped for Trujet flights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X