వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు చిరంజీవి గుడ్‌బై?: సభ్యత్వం పునరుద్ధరించుకోలేదు! రాహుల్ కోరినా.., పవన్ ఉండగా..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటుడు, కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇందుకు పలు కారణాలు కూడా బలంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

బాబూ! మీకు అండగా ఉంటా: ఐటీ సోదాలపై పవన్ కళ్యాణ్ మెలిక! మళ్లీ చిరంజీవి ప్రస్తావనబాబూ! మీకు అండగా ఉంటా: ఐటీ సోదాలపై పవన్ కళ్యాణ్ మెలిక! మళ్లీ చిరంజీవి ప్రస్తావన

 కాంగ్రెస్ పార్టీకి దూరంగా..

కాంగ్రెస్ పార్టీకి దూరంగా..

మొదట రాజకీయ అరంగేట్రం చేస్తూ ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు చిరంజీవి. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి.. అప్పటి నుంచి ఆ పార్టీ నేతగానే కొనసాగుతున్నారు. రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ ఆయన పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్‌ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు చిరంజీవి.

Recommended Video

నన్ను సీఎం అనండి అని అడిగి పిలిపించుకున్న పవన్
 సినిమాలపైనే ఆసక్తి..

సినిమాలపైనే ఆసక్తి..

ఈ నేపథ్యంలోనే సినిమాలతో బిజీగా మారారు. 150వ చిత్రం ‘ఖైదీ నం.150'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి... ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి బయోపిక్‌ ‘సైరా'లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆయన మరిన్ని సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

రాహుల్ కోరినా..

రాహుల్ కోరినా..

ఇది ఇలావుంటే, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. చిరంజీవిని కోరినట్లు సమాచారం. అయితే, దీనికి ఆయన నుంచి స్పందన లేనట్లుగా సమాచారం. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఇక దూరమైనట్లేనని భావిస్తున్నారు.

కాంగ్రెస్ సభ్యత్వం పునరుద్ధరించుకోలేదు..

కాంగ్రెస్ సభ్యత్వం పునరుద్ధరించుకోలేదు..

కాగా, ఇటీవల చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా.. దాన్ని పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆయన ఆ పార్టీకిపూర్తిగా దూరమైనట్లేనని అంతా భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు సార్వత్రిక ఎన్నికలు దగ్గపడుతున్నప్పటికీ చిరంజీవి ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఇటీవలి కాలంలో పాల్గొనకపోవడం గమనార్హం.

పవన్ దూసుకెళ్తుండగా..

పవన్ దూసుకెళ్తుండగా..

ఇది ఇలావుండగా, ఇప్పటికే చిరంజీవి సోదరుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. సోదరుడు జనసేన పార్టీతో ప్రజల్లోకి దూసుకెళ్తుండగా.. తాను మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడం సరికాదని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం. అంతేగాక, తనకు ఎంతో ఇష్టమైన సినీ రంగాన్ని మరోసారి వదులుకోవడం కూడా ఆయనకు ఇష్టం లేనట్లుగా తెలుస్తోంది.

English summary
Cine Actor and Former Union Minister Chiranjeevi is likely to say goodbye to congress party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X