వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమ్ముడి రాజకీయాలపై చిరు ఆయిష్టత: అందుకే చెర్రీ అలా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడం కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవికి ఇష్టం లేకపోవడం వల్లనే రామ్ చరణ్ తేజ మాట్లాడడానికి నిరాకరించారని అర్థమవుతోంది. బాబాయ్ పవన్ కల్యాణ్ రాజకీయాలపై రామ్ చరణ్ తేజ్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడడానికి నిరాకరించిన విషయం తెలిసిందే.

రాజకీయాల గురించి తాను మాట్లాడబోనని ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ తేజ అన్నారు. తనకంత వయసు, అనుభవం లేదని ఆయన అన్నారు. అపోలో లైఫ్ ఆధ్వర్యంలో తయారుచేసిన జియో మొబైల్ అప్లికేషన్‌ను గురువారం రామ్ చరణ్ తేజ ఢిల్లీలో ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

Chiranjeevi not interested on Pawan politics: So Cherry no comment

రాజకీయాలలో మీ బాబాయ్ పవన్ ల్యాణ్‌కు మద్దతు ఇస్తారా అని మీడియా ప్రతినిధులు అడగ్గా, రాజకీయాల గురించి మాట్లాడనని, తనకంత వయసు, అనుభవం లేదని బదులిచ్చారు. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల కార్యక్రమంలో చిరంజీవి పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడాన్ని వ్యతిరేకించిన విషయం తెలిసిందే. జోడు గుర్రాలపై పయనించాలని కూడా ఆయన సలహా ఇచ్చారు.

తాను రాజకీయాల్లోకి రావడం చిరంజీవికి ఇష్టం లేదని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ కూడా చెప్పారు. హ్యాపీగా సినిమాలు చేసుకోక రాజకీయాలు ఎందుకు అని చిరంజీవి పవన్ కల్యాణ్‌కు ఓ మధ్యవర్తి ద్వారా చెప్పించారు. అయితే, పవన్ కల్యాణ్ మాత్రం రాజకీయాల్లో అడుగు పెట్టాలనే నిర్ణయించుకున్నారు. ఈ స్థితిలో రామ్ చరణ్ తేజ్ బాబాయ్ పవన్ కల్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడడానికి ఇష్టం పడలేదని అంటున్నారు.

English summary
It is said that Ram Charan Tej rejected to comment on his uncle Pawan Kalayan's Jana Sena, as his father Chiranjeevi is not interested later's political entry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X