• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Chiranjeevi కి రూట్ క్లియర్ : కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ తేల్చి చెప్పేసారు: నెక్స్ట్ మెగా స్టెప్ అదేనా..!!

By Lekhaka
|

తెలుగు రాజకీయాల్లో కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవి హాట్ టాపిక్ గా మారారు. సినిమాలతో బీజీగా ఉన్న చిరంజీవి కరోనా సమయంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు..మా ఎన్నికల్లో చిరంజీవి మద్దతు పైన జరుగుతున్న ప్రచారం తో పాటుగా...ఏపీ రాజకీయాల్లో చిరంజీవి భవిష్యత్ అడుగుల పైన చర్చ సాగుతోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి..జగన్ సీఎం అయిన తరువాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు చిరంజీవి మద్దతు ఇస్తున్నారు. ఇదే సమయంలో చిరంజీవి అంగీకరిస్తే రాజకీయంగా తగిన గుర్తింపు ఇచ్చేందుకు వైసీపీ సిద్దమని తెలుస్తోంది.

చిరంజీవిని ఒప్పించేందుకు టీం రెడీ..

చిరంజీవిని ఒప్పించేందుకు టీం రెడీ..

అందులో భాగంగా...జగన్ సరే అంటే ముందుకెళ్లి చిరంజీవితో చర్చించటానికి ఒక సీనియర్ తో సహా ఇద్దరు మంత్రులు..అదే విధంగా అయిదుగురు సీనియర్ నేతలు సిద్దమయినట్లు సమాచారం. చిరంజీవితో వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే, చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నా..కాంగ్రెస్ ను వీడలేదని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీ ఏపీ కాంగ్రెస్ లో చిరంజీవి పాత్ర పైన స్పష్టత ఇచ్చారు. కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగడం లేదని ఆయన తేల్చి చెప్పారు. పార్టీ పరంగా ముఖ్యమైన సమావేశాలు హైదరాబాద్ లో జరిగినా...విజయవాడలో జరిగినా ఆయన దూరంగానే ఉంటున్నారని వివరించారు.

 బీజేపీ నుండి ఆహ్వానం..

బీజేపీ నుండి ఆహ్వానం..


రఘువీరా పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో కొంత క్రియాశీలంగా కనిపించిన చిరంజీవి...ఇప్పుడు పూర్తిగా దూరమయ్యారు. అయితే, ఆయన్ను ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజు నియమితులైన వెంటనే తొలుత హైదరాబాద్ వెళ్లి ముందుగా చిరంజీవిని కలిసారు. ఆ తరువానే మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. చిరంజీవితో కలిసిన సమయంలో మెగాస్టార్ ను సోము వీర్రాజు బీజేపీ-జనసేనకు మద్దతివ్వాలని..బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలిసింది. ఆ తరువాత తాను చిరంజీవిని ఎందుకు కలిసానో ఆ అంశం నెరవేరిందని సోము ఆ తరువాత చెప్పుకొచ్చారు.

 జనసేనతోనూ దూరంగా..

జనసేనతోనూ దూరంగా..

అయితే, జనసేన కు చిరంజీవి మద్దతు ఉందని ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించినా..జనసేన కార్యక్రమాల్లో ఎక్కడా చిరంజీవి జోక్యం కనిపించటం లేదు. ఇదే సమయంలో..ముఖ్యమంత్రి జగన్ తో పెరుగుతున్న సఖ్యత... మెగాస్టార చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా చిరంజీవి పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయంగా ఆయనతో కలిసి పని చేసిన కొందరు నేతలు సైతం అదే అంచనాతో కనిపిస్తున్నారు. ఇంకా 2024 ఎన్నికలకు దాదాపుగా మూడేళ్ల సమయం ఉంది.

 వైసీపీ మెగా స్ట్రాటజీ..చిరు అంగీకరిస్తే..

వైసీపీ మెగా స్ట్రాటజీ..చిరు అంగీకరిస్తే..

వచ్చే ఏడాది జూన్ లో రాజ్యసభ సభ్యలను వైసీపీ నుండి భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో చిరంజీవికి పెద్దల సభలో వైసీపీ నుండి అవకాశం ఇవ్వాలని ..దీని ఎఫెక్ట్ 2024 లో జరిగే ఎన్నికల్లో ఉపకరిస్తుందని ఏపీ అధికార పార్టీ అంచనా వేస్తోంది. ఇక, రాజకీయంగా కొన్ని కష్ట నష్టాలు చిరంజీవి గతంలోనే ఫేస్ చేసినా...ఆయనుకు ఉన్న అభిమానం మాత్రం ఎక్కడా తగ్గలేదనే వాదన ఉంది. దీంతో..ఇప్పుడు అటు బీజేపీ సైతం చిరంజీవి కోసం ప్రయత్నాలు చేస్తున్నా...కాషాయం కంటే సీఎం జగన్ నిర్ణయాల పైనే చిరంజీవి సానుకూలంగా స్పందిస్తున్న తీరు మాత్రం ఏపీ భవిష్యత్ రాజకీయాల అంచనాలకు కారణం అవుతోంది.

English summary
congress AP Incharge Oommen Chandi clarified that Chiranjeevi in not with congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X