వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వినాయక్ రెడీ:ఎన్నికల తర్వాతే చిరు 150వ సినిమా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకుడు చిరంజీవి 150వ సినిమాపై ఎప్పటికప్పుడు కొత్త ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. సినిమా చేయాలనే ఆసక్తిని చిరంజీవి ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తున్నప్పటికీ రాజకీయాల కారణంగా కుదరడం లేదు. ఇప్పుడు ఆ సినిమా నిర్మాణం ఎన్నికల తర్వాత గడువుకు వెళ్లింది.

చిరంజీవి 150వ సినిమాకు వివి వినాయక్ పనిచేయనున్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం స్క్రిప్టు మీద కూర్చున్నట్లు చెబుతున్నారు. వివి వినాయక్ ఠాగూర్ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆయన తన కథను చిరంజీవికి ఎన్నికల తర్వాత వినిపిస్తారని సమాచారం.

చిరంజీవి 150వ సినిమా యాక్షన్, రోమాన్స్, కామెడీలతో వినోదాన్ని అందించే విధంగా ఉండడమే కాకుండా సందేశాన్ని కూడా ఇస్తుందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తారని సమాచారం.

కాగా, వివి వినాయక్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సమంత సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి 150వ సినిమా ప్రారంభమై, పూర్తి కావడం అనేది జరుగుతుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి.

English summary
Megastar Chiranjeevi is expected to film his 150th movie after 2014 general elections and as we have reported earlier director VV Vinayak will wield the megaphone for the movie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X