వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదే నిదర్శనం: పవన్ కళ్యాణ్ ఆఫర్, చిరంజీవికి జనసేనలో కీలక పదవి?

|
Google Oneindia TeluguNews

అమరావతి: 2019 ఎన్నికలకు ముందు ఏపీలో రాజకీయాలు ఊహించని మలుపు తిరిగేలా కనిపిస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి షాకివ్వనున్నారా? అంటే కావొచ్చుననే ప్రచారం సాగుతోంది. ఆయన తన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన వైపు వెళ్లే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు.

అదీ పవన్ కళ్యాణ్ స్థాయి, ఇదీ నేను: కత్తి మహేష్‌, దిమ్మతిరిగే షాకిచ్చిన అభిమానిఅదీ పవన్ కళ్యాణ్ స్థాయి, ఇదీ నేను: కత్తి మహేష్‌, దిమ్మతిరిగే షాకిచ్చిన అభిమాని

Recommended Video

Chiranjeevi A Big Minus For Pawan Kalyan | Oneindia Telugu

మెగా సోదరులు ఇద్దరు (చిరంజీవి, పవన్ కళ్యాణ్) చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే మరో సోదరుడు నాగబాబు తాను తన తమ్ముడి వైపు ఉంటానని టీవీ ఇంటర్వ్యూలలో దాదాపు తేల్చేశారు. చిరంజీవి కాదని చెప్పినప్పటికీ ఆ దిశగా అడుగులు పడవచ్చునని ప్రచారం సాగుతోంది.

పవన్! అల్లు అరవింద్‌పై ఏడవకు: కత్తి మహేష్, చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలుపవన్! అల్లు అరవింద్‌పై ఏడవకు: కత్తి మహేష్, చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు

 వేర్వేరు దారులు, ఒక్కటవుతాయా?

వేర్వేరు దారులు, ఒక్కటవుతాయా?

చిరంజీవి జనసేన పార్టీ వైపు వస్తారని, ఆయన తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు అండగా నిలబడతారని గతంలో ప్రచారం సాగింది. ఈ వార్తలను చిరంజీవి కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. అయితే, ఏపీలో కాంగ్రెస్ తిరిగి పుంజుకోలేని పరిస్థితుల్లో ఉన్నందున చిరంజీవి తమ్ముడికి అండగా నిలబడతారని అంటున్నారు. తమవి రాజకీయంగా వేర్వేరు దారులు అని ఇరువురు ప్రకటించారు. కానీ ఒక్క దారిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

 జనసేనలో చిరంజీవికి కీలక పదవి?

జనసేనలో చిరంజీవికి కీలక పదవి?

సినిమా పరిశ్రమలో ఇటీవలి కాలంలో ఓ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోందని తెలుస్తోంది. జనసేన పార్టీ గౌరవాధ్యక్షులుగా చిరంజీవి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం మెగా సోదరులు ఇద్దరు కలుస్తారేమోనని రాజకీయ వర్గాల్లోను చర్చ సాగుతోంది.

 పదేపదే ప్రజారాజ్యం, చిరంజీవి

పదేపదే ప్రజారాజ్యం, చిరంజీవి

పవన్ కళ్యాణ్ ఇటీవల నాలుగు రోజుల పాటు విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం, ఒంగోలులో పర్యటించారు. ఈ సందర్భంగా పదేపదే ఆయన ప్రజారాజ్యం పార్టీ గురించి ప్రస్తావించారు. తన సోదరుడు చిరంజీవి నోట్లో నాలుక లేనివాడు అని, పెద్దగా మాట్లాడడని పలుమార్లు చెప్పారు.

 చిరంజీవి ముఖ్యమంత్రిగా ఉండేవారు

చిరంజీవి ముఖ్యమంత్రిగా ఉండేవారు

అంతేకాదు, కొందరు స్వార్థపరుల కారణంగా నాడు ప్రజారాజ్యం పార్టీ విఫలమైందని, వారు లేకుంటే ఇప్పటికే తన సోదరుడు చిరంజీవి ముఖ్యమంత్రిగా ఉండేవారని పవన్ కళ్యాణ్ చెప్పారు. నాలుగు రోజుల పర్యటనలో ప్రజారాజ్యం, చిరంజీవి గురించి పదేపదే ప్రస్తావించారు.

వెన్నుపోటు పొడిచిన వారిని వదలమని

వెన్నుపోటు పొడిచిన వారిని వదలమని

తన సోదరుడు చిరంజీవికి వెన్నుపోటు పొడిచిన వారికి తాను జనసేన పార్టీ ద్వారా చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెబుతానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తన ప్రమేయం లేకుండా ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిందని చెప్పారు.

 ఇదే నిదర్శనం అంటూ

ఇదే నిదర్శనం అంటూ

చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానించి, గౌరవాధ్యక్ష పదవి ఇస్తానని పవన్ కళ్యాణ్ ఆఫర్ చేస్తారని తెలుస్తోంది. తమ్ముడికి చిరు అండగా ఉంటాడని చెప్పేందుకు ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీకి దూరం పాటించడమే నిదర్శనం అంటున్నారు.

English summary
Ahead of the Assembly elections, it is believed that the two brothers may join hands for a chance to emerge victorious. There are serious speculations in the film industry about Chiranjeevi all set to take up the post of the honorary president of the Jana Sena Party, founded by his younger brother, Pawan Kalyan. Ahead of the Assembly elections, it is believed that the two brothers may join hands for a chance to emerge victorious.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X