వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసుల పనితీరు హ్యాట్సాఫ్ .. ఒక పోలీసు బిడ్డగా సెల్యూట్ చేస్తున్నా : చిరంజీవి

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ ప్రపంచ గతిని మార్చేసింది . కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. పోలీసులు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం పహారా కాస్తున్నారు. 24 గంటలు కరోనా కట్టడి కోసం ఇదులు నిరర్తిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల పనితీరుపై మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. రాత్రింబవళ్లు ప్రజల కోసం వారు చాలా కష్టపడుతున్నారని ఒక పోలీసు బిడ్డగా సెల్యూట్ చేస్తున్నా అని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.

చేతులెత్తి మొక్కుతా చెయ్యి చెయ్యి కలపకురా ... చిన్నోళ్ళ నుండి వృద్ధుల దాక స్టెప్పులు .. సాంగ్ వైరల్చేతులెత్తి మొక్కుతా చెయ్యి చెయ్యి కలపకురా ... చిన్నోళ్ళ నుండి వృద్ధుల దాక స్టెప్పులు .. సాంగ్ వైరల్

ఇక ఆ వీడియోలో మెగా స్టార్ చిరంజీవి "ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసుల పని తీరు అద్భుతం. నిద్రాహారాలు కూడా మాని వారు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్‌ నుంచి స్వయంగా చూస్తున్నాను. వారి పనితీరు వల్ల లాక్‌డౌన్‌ విజయవంతమతోంది. అలా జరగబట్టే కరోనా విజృంభణను చాలా వరకు అదుపులోకి వచ్చింది. అలాగే, ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నాను. ప్రజలంతా పోలీసులకు సహకరించండి. పోలీసులు చేస్తున్న పనికి ఓ పోలీసు బిడ్డగా నేను వారికి సెల్యూట్ చేస్తున్నాను" అని చిరంజీవి తన కృతజ్ఞతలను తెలియజేశారు.

 Chiranjeevi salutes and says Hatsoff to the telugu states police

ఇక లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినీ కార్మికుల కోసం వారి ఆకలి బాధలు తీర్చటం కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసిన చిరంజీవి తన వంతుగా రూ.కోటి రూపాయల విరాళం ఇచ్చి తన మానవతా దృక్పధాన్ని చాటుకున్నారు . ఇక ఇప్పుడు పోలీసులు చేస్తున్న విశేష సేవలను కొనియాడుతూ వారికి సెల్యూట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాల్లో లాక్ డౌన్ నేపధ్యంలో పోలీసులు సేవలు అందిస్తున్నారు. ప్రజలు గుమికూడకుండా చేస్తూనే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు కాపలా కాస్తున్నారు. కరోనా కట్టడిలో మేము సైతం అంటున్న పోలీసుల పనితీరును పలువురు సినీ ప్రముఖులు కొనియాడటం వారికి కాస్త బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ముఖ్యంగా చిరంజీవి తన వీడియో ద్వారా ఇచ్చిన సందేశం వారిలో మరింత ఉత్సాహం నింపుతుంది.

English summary
Mega Star Chiranjeevi has lauded the works of the police departments of the two Telugu States. Chiranjeevi said the Police have been protecting the people of the states in this tough lockdown period. Giving a reference to Hyderabad Police, the actor has praised them for making the lockdown period successful. The effort of the Police has controlled the spread of the virus to a more considerable extent, Mega Star added. He has urged everyone to extend support to the Police in this crucial hour. Reminding him of the son of a police person, he has saluted the Police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X