• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

త్వరలో ఢిల్లీకి చిరు .. సైరా కోసం అందర్నీ కలుస్తూ కేసీఆర్ ని కలవని మెగా స్టార్

|
  Syeraa: Chiranjeevi Is Going To Meet Venkaiah Naidu In Delhi | Oneindia Telugu

  మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత ప్రతిష్టాత్మకంగా భావించి నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇది మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు అని అందరికి తెలిసిందే. ఇప్పటికి కూడా ఈ చిత్రం థియేటర్లలో హౌస్ ఫుల్ గానే నడుస్తోంది. అయితే ఈ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్న చిరంజీవి ప్రస్తుతానికి పెద్ద పెద్ద ప్రముఖులందరికి కూడా ఈ చిత్రాన్ని చూపించే పనిలో పడ్డారు.

  చిరంజీవి జగన్ ల భేటీ: పవన్‌కు చిక్కులేనా.. కక్కలేక మింగలేక జనసేనాని

  జగన్ ని కలిసి సైరా చూడమని చెప్పిన చిరు

  జగన్ ని కలిసి సైరా చూడమని చెప్పిన చిరు

  ఇటీవల ఈమేరకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ని కలుసుకొని తనకు ఈ సైరా చిత్రాన్ని చూపించారు చిరంజీవి. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలుసుకొని సైరా చిత్రం విశేషాలను తెలిపి,జగన్ ఇంట్లో లంచ్ భేటీని ముగించుకొని సైరా చిత్రాన్ని చూడాల్సిందిగా చిరు దంపతులు సీఎం జగన్ ని కోరారు. ఇక ఇదే నేపథ్యంలో చిరంజీవి త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారని తెలుస్తుంది.

  త్వరలో ఢిల్లీ వెళ్లనున్న మెగాస్టార్ , మోడీని , వెంకయ్య నాయుడ్ని కలిసే ఛాన్స్

  త్వరలో ఢిల్లీ వెళ్లనున్న మెగాస్టార్ , మోడీని , వెంకయ్య నాయుడ్ని కలిసే ఛాన్స్

  నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న చిరంజీవి సైరా సినిమా ద్వారా పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన కీలక నాయకులను కలవనుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. త్వరలో ఢిల్లీ వెళ్లనున్న చిరంజీవి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ని కలుసుకొని,ఈ సైరా చిత్రం విశేషాలన్నీ చెప్పి, ఆయనకు సైరా చిత్రాన్ని చూడాలని చెప్పే ఆలోచనలో ఉన్నారు . అంతేకాకుండా మన దేశ ప్రధాని మోడీని కలుసుకొని సైరా చిత్ర విశేషాలను చెప్పి, ఆయనను సైతం చిత్రం చూడాలని కోరనున్నట్లుగా సమాచారం.

  కేసీఆర్ ని కలవకుండా పక్కన పెడుతున్న చిరు

  కేసీఆర్ ని కలవకుండా పక్కన పెడుతున్న చిరు

  సైరా సినిమా కోసం అందర్నీ కలుస్తున్న చిరంజీవి తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవడం లేదు. కెసిఆర్ కుటుంబంతో చిరంజీవి కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, చరణ్, కేటీఆర్ లు మంచి స్నేహితులు అయినప్పటికీ కూడా ఇవి కెసిఆర్ ని కలవడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది. అందరి దగ్గరికి వెళ్తున్న చిరంజీవి తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న కెసిఆర్ దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదు అన్న దానిపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతోంది.

  కేసీఆర్ ను కలవని కారణం ఇదేనా ?

  కేసీఆర్ ను కలవని కారణం ఇదేనా ?

  సైరా చిత్రానికి సంబంధించిన స్పెషల్ షో లకు ఏపీలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో సైరా బెనిఫిట్ షో లకు ఎలాంటి అనుమతి లభించలేదు. ఇక అంతే కాదు చిరంజీవి బంధువైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీని వీడి బయటకు వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కుటుంబానికి చిరంజీవి కుటుంబానికి కాస్త దూరం పెరిగినట్లుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి సైరా సినిమా కోసం కెసిఆర్ ని కలవాలని ఆలోచనలో లేనట్టుగా తెలుస్తోంది.

  సైరా కోసమేనా .. రాజకీయ యాత్రలో మతలబు వేరే ఉందా ?

  సైరా కోసమేనా .. రాజకీయ యాత్రలో మతలబు వేరే ఉందా ?

  గతంలో ఎన్నడూ తాను చేసిన సినిమా చూడండి అని ఏ హీరోలు-రాజకీయ యాత్ర చేయలేదు. కానీ చిరంజీవి మాత్రం ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల నాయకులను కలుస్తూ ఉండడం,వారిని సినిమా చూడమని చెప్పడం ఒకింత ఆసక్తికరంగా మారింది.మొత్తానికి సైరా సినిమా ద్వారా రాజకీయ యాత్ర చేపట్టిన చిరంజీవి ఆంతర్యం ఏమిటి అనేది ఎవరికి అంతుపట్టకుండా ఉంది. కేవలం సైరా సినిమా కోసమే చిరంజీవి అందర్నీ కలుస్తున్నారా.. లేదా ఇందులో ఏమైనా మతలబు ఉందా అన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్సే.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Chiranjeevi, who has been silent till yesterday, is keen in political circles to meet key leaders of various political parties through the film 'Saira'. Chiranjeevi, who is going to Delhi soon, will meet Vice President Venkaiah Naidu and planning to say to look for Saira. It is also reported that chiru will meet the Prime Minister of India Modi and tell him about the details of Saira
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more