వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాలతో శత్రువులు.. నిలదీసిన చిరంజీవి.. ప్రేమతో జవాబిచ్చిన విజయశాంతి

|
Google Oneindia TeluguNews

సూపర్‌స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. 13 ఏళ్ల తర్వాత లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి ఓ కీలకపాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి, విజయశాంతి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. వారిద్దరి మధ్య ఆప్యాయత, అనురాగాలు, అలకలు స్పష్టంగా కనిపించాయి. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇలా సాగింది...

13 ఏళ్ల తర్వాత నా హీరోయిన్

13 ఏళ్ల తర్వాత నా హీరోయిన్

సరిలేరు నీకెవ్వరూ సినిమా యూనిట్‌ గురించి మాట్లాడిన అనంతరం చివరగా విజయశాంతి గురించి చిరంజీవి మాట్లాడుతూ.. సండే అననురో.. మండే అననునరో.. ఎన్నడూ నీదానినినేరా అంటూ నా హీరోయిన్ చెప్పి.. 13 ఏళ్ల తర్వాత నన్ను వదిలేసి సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమాలో విజయశాంతి భావ్యమా అని అన్నారు. విజయశాంతి నాకు చాలా ఎమోషనల్ రిలేషన్ ఉండేది. ఫ్యామిలీ పరంగా సంబంధాలు ఉండేవి. సినిమాలపరంగా సుమారు 20 సినిమాలు నటించాను.

నా కంటే ముందే రాజకీయాల్లోకి వెళ్లి

నా కంటే ముందే రాజకీయాల్లోకి వెళ్లి

అయితే అలాంటి విజయశాంతి మీద నాకు చాలా కోపం ఉంది. నా కంటే ముందు రాజకీయాల్లోకి వెళ్లావు కాదా? అంటూ విజయశాంతితో మాటలు కలుపుతూ.. రాజకీయాల్లోకి నాకంటే ముందు వెళ్లావు సరే.. కానీ నన్ను మాటలు అనాలని నీకు మనసు ఎలా వచ్చింది అంటూ చిరంజీవి నిలదీశాడు. అందుకు సమాధానంగా నా చేయి ఎంత రఫ్‌గా ఉందో చూశావా? రఫ్ ఆడిస్తా అంటూ సరదాగా సంభాషణ మొదలుపెట్టింది.

రాజకీయం వేరు.. సినిమా వేరు

రాజకీయం వేరు.. సినిమా వేరు

చిరంజీవి ప్రశ్నకు బదులిస్తూ రాజకీయం వేరు.. సినిమా వేరు. అయినా నేను నీ మిత్రురాలినే. నువ్వు నా హీరో.. నేను నీ హీరోయిన్‌ను. ఇద్దరం కలిసి 20 సినిమాలు చేశాను. నేను ఎక్కువగా నీతోనే చేశాను. మళ్లీ సినిమా చేద్దామా? అని విజయశాంతి అంటే.. తప్పకుండా చేద్దాం అంటూ చిరంజీవి సమాధానం చెప్పారు.

పాలిటిక్స్‌తో శత్రువులు

పాలిటిక్స్‌తో శత్రువులు

సరిలేరు నీకెవ్వరూ కార్యక్రమంలో ఓ విషయాన్ని సీరియస్‌గా చెప్పాలనుకొంటున్నాను. రాజకీయం శత్రువులను పెంచుతుంది. సినిమా రంగం స్నేహాన్ని పెంచుతుంది. నాకు విజయశాంతి ప్రేమ ఉండటం వల్ల తాను నన్ను కామెంట్ చేసినా నేను ఏమీ అనలేదు. ఒక్కమాట.. ఎక్కడైనా అన్నానా.. నిన్ను ఒక్క మాట కూడా అనలేదు. నీకు ఎలా అనాలనిపించింది అని చిరంజీవి అన్నారు.

పరిస్థితుల వల్ల అలాంటి కామెంట్లు

పరిస్థితుల వల్ల అలాంటి కామెంట్లు


చిరంజీవి ప్రశ్నలకు విజయశాంతి సమాధానం ఇస్తూ.. కొన్ని పరిస్థితుల్లో అలా వ్యవహరించాల్సి వస్తుంది. రాజకీయం వేరు.. వ్యక్తిగత సంబంధాలు వేరు. ఉద్యమంలో కొన్నిసార్లు అలా అనాల్సి వస్తుంది. ప్రజల కోసం కొన్నంటిని పక్కన పెట్టాల్సి వస్తుంది. పోలీసులు ఉద్యోగ రీత్యా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. నేను కూడా రాజకీయాల్లో అలాగా వ్యవహరించాను. అంతమాత్రాన నీ మీద ప్రేమ లేదని కాదు. మన మధ్య మంచి సంబంధాలు ఉండబట్టే 20 సినిమాలు చేశాం అని విజయశాంతి పేర్కొన్నారు.

English summary
Mega Star Chiranjeevi, Lady Super star VijayaShanti's conversation about Andhra Pradesh Politics goes viral on eve of Sarileru neekevvaru pre release event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X