వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీతో బంధం: జగన్‌కు చింతా 'జీఎస్టీ' ఝలక్, 'సీఎం పదవి నుంచి రెండు కులాల వారు తప్పుకోవాలి'

|
Google Oneindia TeluguNews

గుంటూరు/అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రపై టీడీపీ నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా మండిపడుతోంది. అంతేకాదు, జగన్ బీజేపీతో ఉన్న అనుబంధాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

'స్వరం మార్చిన రోజా, జగన్‌కు ఇబ్బందులు మొదలు, రాత్రుళ్లు మాట్లాడుకుంటున్నారు''స్వరం మార్చిన రోజా, జగన్‌కు ఇబ్బందులు మొదలు, రాత్రుళ్లు మాట్లాడుకుంటున్నారు'

జగన్ చేస్తోంది పాదయాత్ర కాదని, మళ్లీ దోచుకునేందుకే ఆయన ఈ దండయాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ ధ్వజమెత్తారు. ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్ తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు విమర్శించడం లేదన్నారు.

జేసీ దుమారం, ఇక అంతేనా?: బాబు పక్కా ప్లాన్, మోడీపై ఆగ్రహంతోనే గుజరాత్‌కు దూరంజేసీ దుమారం, ఇక అంతేనా?: బాబు పక్కా ప్లాన్, మోడీపై ఆగ్రహంతోనే గుజరాత్‌కు దూరం

జీఎస్టీ మాటేమిటి, బీజేపీతో బంధం బయటపెట్టాలి

జీఎస్టీ మాటేమిటి, బీజేపీతో బంధం బయటపెట్టాలి

బీజేపీతో ఉన్న సంబంధాలు ఏమిటో చెప్పాలని జగన్‌ను చింతా మోహన్ డిమాండ్ చేశారు. మోడీని కలిసిన తర్వాత బీజేపీని విమర్శించడం లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. జీఎస్టీపై అన్ని పార్టీలు స్పందిస్తే మీరు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. దీనిని బట్టే ఆయన బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.

ఎవరీ సీఎం కాలేదు, రెండు సామాజిక వర్గాలు తప్పుకోవాలి

ఎవరీ సీఎం కాలేదు, రెండు సామాజిక వర్గాలు తప్పుకోవాలి

ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థ నాయకుడని చింతా మోహన్ ధ్వజమెత్తారు. అధర్మ పరిపాలన కొనసాగుతోందని ఆయనకు మళ్లీ అధికారం ఎందుకన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఐదు జిల్లాల నుంచి ఇప్పటి వరకు ఎవరూ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించలేదని తెలిపారు. రెండు సామాజిక వర్గాల వారు పక్కకు తప్పుకోవాలని చెప్పారు.

సీఎం కావాలని వారు కోరుకుంటున్నారు

సీఎం కావాలని వారు కోరుకుంటున్నారు

వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తులు ముఖ్యమంత్రి పదవిని అడుగుతున్నారని చింతా మోహన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీ మొత్తంలో ముడుపులు చేతులు మారుతున్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పోలవరం కేంద్రం ప్రాజెక్టు కదా అని నిలదీశారు.

బ్లాక్‌లో సేవా టిక్కెట్లు

బ్లాక్‌లో సేవా టిక్కెట్లు

తిరుపతిలోని స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని చింతా మోహన్ డిమాండ్‌ చేశారు. టిటిడిలో నిరంకుశ పాలన సాగుతోందని, పారదర్శకత లోపించిందన్నారు. సేవా టిక్కెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారన్నారు. కొందరు ప్రజా ప్రతినిధులే వస్త్రం టిక్కెట్టును రూ.5 లక్షలకు విక్రయిస్తున్నారన్నారు.

English summary
Former MP and Congress leader Chita Mohan demanded to YSR Congress Party chief YS Jaganmohan Reddy about alliance with BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X