వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ పాల‌న‌లో చంద్ర‌బాబు ఫొటోల‌తో: అధికారుల‌కు ప్రేమ త‌గ్గ‌లేదా : వైసీపీ అభిమానుల ఫైర్‌..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల‌న‌లో మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప్రాధాన్య‌త‌. చంద్ర‌బాబు మీద ఆయ‌న సొంత జిల్లా అధికారుల‌కు అభిమానం త‌గ్గినట్లు లేదు. ఇంకా..చంద్ర‌బాబే ముఖ్య‌మంత్రి అనుకుంటున్నారో..లేక జ‌గ‌న్ సీఎం అయినా జీర్ణించుకోలేక పోతున్నారో తెల‌యిదు కానీ..త‌మ అభిమానం మాత్రం చూపిస్తున్నారు. అయితే, ఇదే జిల్లా నుండి ఇద్ద‌రు కేబినెట్‌లో ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. 13 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుండి గెలిచారు. అయినా.. జ‌గ‌న్ పాల‌న‌లోనూ ఇంకా చంద్ర‌బాబు ఫొటోల‌తోనే ల‌బ్దిదారుల‌కు చేరాల్సిన‌వి చేరుతున్నాయి. ఇది..వైసీపీ అభిమానుల‌కు రుచించ‌టం లేదు. ఎక్క‌డ లోం..ఎందుకీ ఉదాసీన‌త అని ప్ర‌శ్నిస్తున్నారు.

జ‌గ‌న్ అనే నేను..: క‌డ‌పలో స్టీల్ ఫ్యాక్ట‌రీని ప్రారంభిస్తా: మూహూర్తం ఇదే..ఎన్నో డ్రామాలు చేసారు..జ‌గ‌న్ అనే నేను..: క‌డ‌పలో స్టీల్ ఫ్యాక్ట‌రీని ప్రారంభిస్తా: మూహూర్తం ఇదే..ఎన్నో డ్రామాలు చేసారు..

రాజ‌న్న బడిబాలో చంద్రన్న ఫొటోల‌తో..

రాజ‌న్న బడిబాలో చంద్రన్న ఫొటోల‌తో..

వైయ‌స్సార్ జ‌న్మ‌దినం సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించింది. అందులో బాగంగా సీఎం జ‌గ‌న్ క‌డ‌ప జిల్లాలో వైయ‌స్సార్ భ‌రోసాతో పాటుగా రైతుల‌కు సంబంధించి అనేక ప‌ధ‌కాల‌ను ప్రారంభించారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో పాఠ‌శాల‌ల విద్యార్దినుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రాజ‌న్న బ‌డిబాట ప‌ద‌కంలో భాగంగా విద్యార్దుల‌ను సైకిళ్ల పంపిణీ చేప‌ట్టింది. అయితే చిత్తూరు జిల్లా పీలేరులో మాత్రం అధికారులు వ్య‌వ‌హ‌రించిన తీరు ఇప్పుడు వివాదా స్ప‌దంగా మారింది. పీలేరులో ఈ కార్య‌క్ర‌మంలో బాగంగా విద్యార్ధినుల‌కు పంపిణీ చేసిన సైకిళ్ల మీద మాజీ ముఖ్య మంత్రి చంద్ర‌బాబు..విద్యాశాఖ మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఫొటోల‌తో ఉన్న స్టిక్క‌ర్లు ఆ సైకిళ్ల మీద ఉన్నాయి. ఏ మాత్రం మార్పు లేకుండా..ప్ర‌భుత్వం మారింద‌నే స్పృహ లేకుండా జిల్లా విద్యాశాఖాధికారులు ఆ సైకిళ్ల‌నే అక్క‌డకు వ‌చ్చిన విద్యార్దినుల‌కు అవే సైకిళ్ల‌ను పంపిణీ చేసారు. ఈ స్టిక్కర్లపై టీడీపీ అమలు చేసిన ‘బడికొస్తా' పథకం పేరు ఉన్నప్పటికీ అలాగే విద్యార్థినులకు పంపిణీ జ‌రిగింది.

ఎమ్మెల్యే ఉదాసీన‌త‌.. అధికారుల నిర్ల‌క్ష్యం

ఎమ్మెల్యే ఉదాసీన‌త‌.. అధికారుల నిర్ల‌క్ష్యం

ప్ర‌భుత్వం మారినా..ప‌ధ‌కం పేరు మారినా అధికారులు మాత్రం ఇవేమీ ప‌ట్టించుకోవ‌టం లేదు. క‌ళ్ల ముందు సైకిళ్ల మీద ప‌చ్చ స్టిక్క‌ర్లు చంద్ర‌బాబు.. గంటా ఫొటోల‌తో క‌నిపిస్తున్నా ఆలోచ‌న కూడా క‌ల‌గ‌లేదు. గ‌త ప్ర‌భుత్వంలో గంటా శ్రీనివాస రావు విద్యా శాఖా మంత్రిగా ప‌ని చేస్తున్న స‌మ‌యంలో విద్యార్ధినుల‌కు సైకిళ్లు పంపిణీ చేయాల‌నే ఆలోచ‌న చేసారు. అందు కోసం బ‌డికొస్తా ప‌ధ‌కం పేరుతీ వీటిపి పంపిణీ చేయాల‌ని భావించారు. అయితే, అది అమ‌లు కాలేదు. దీంతో..కొత్త ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత రాష్ట్ర వ్యాప్తంగా అప్ప‌టికే సేక‌రించి..స్టిక్క‌ర్లు అంటించిన ఆ సైకిళ్ల‌ను మార్చి వేయాల‌ని అదే స‌మ‌యంలో వాటిని వృధా చేయ‌కుండా రాజ‌న్న బ‌డిబాట పేరుతో పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారుల‌ను ఆదేశించింది. ఇందు కోసం రాజ‌న్న బ‌డిబాట స్టిక్క‌ర్ల‌ను పంపిణీ చేసింది. కానీ. చంద్ర‌బాబు సొంత జిల్లాలో మాత్రం అధికారులు ఏమ‌నుకున్నారో ఏమో కానీ..జ‌గ‌న్ పాల‌న‌లోనూ ప‌చ్చ స్టిక్క‌ర్లు ఉన్న సైకిళ్ల‌నే పంపిణీ చేయ‌టం ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది.

 వైసీపీ అభిమానుల ఆగ్ర‌హం..

వైసీపీ అభిమానుల ఆగ్ర‌హం..

టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని..ఇప్పుడు త‌మ ప్ర‌భుత్వం అధికా రంలోకి వ‌చ్చినా ఇంకా చంద్ర‌బాబు పేరుతో ల‌బ్ది దారుల‌కు ప్ర‌భుత్వ ప‌ధ‌కాలు అంద‌టం పైన సీరియ‌స్ అవుతున్నా రు. కొద్ది రోజుల క్రితం కాకినాడ మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌లో జ‌న‌సేన నేత పేరుతో అక్క‌డ తాజాగా జ‌రిగిన నిర్మాణానికి ప్రారంభోత్స‌వం చేయాల‌ని నిర్ణ‌యించిన వ్య‌వ‌హారంలో వైసీపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. అదే విధంగా వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కొన్నింటికి పేర్లు మార్చినా..త‌గిన రీతిలో ప్ర‌చారం జ‌ర‌గలేదు. దీంతో..మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పేరుతోనే ఇప్ప‌టికీ కొన్ని చోట్ల ల‌బ్ది దారుల‌కు ప‌ధ‌కాలు అందుతున్నాయి. ఇక‌, తాజాగా పీలేరులో విద్యార్ధినుల‌కు సైకిళ్ల పంపిణీలోనూ టీడీపీ ప్ర‌భుత్వ‌మే ఉందా..టీడీపీయే సైకిళ్ల‌ను పంపిణీ చేస్తుందా అనే రీతిలో అక్క‌డి అధికారులు వ్య‌వ‌హ‌రించారు. దీని పైన స్థానికంగా ఉన్న వైసీపీ నేత‌లు మాత్రం ఫైర్ అవుతున్నారు.

English summary
In Rajanna Badi Bata program Chittor district education dept officials distribute cycles to girls with TDP stickers and Ex CM Chandra babu photos. Now this issue became political discussion in state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X