చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిత్తురు మేయర్ అభ్యర్థి హేమలత, వారికి బాబు ఓకే: అనురాధ బంధువే..

చిత్తూరు మేయర్‌ అభ్యర్థిగా హేమలత పేరును ఖరారు చేశారు. హేమలత పేరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రకటించారు.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు మేయర్‌ అభ్యర్థిగా హేమలత పేరును ఖరారు చేశారు. హేమలత పేరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రకటించారు.

హేమలత కఠారి అనురాధ బంధువు. చిత్తూరు మేయర్‌ పదవికి ఈ నెల 15న ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లను చంద్రబాబు అభినందించారు.

చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ, ఎమ్మెల్సీ రాజసింహులు, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పులివర్తి నానిల ఆధ్వర్యంలో ఇటీవల గెలుపొందిన కార్పొరేటర్లు హేమలత, చెరుకూరి వసంత కుమార్‌లతో సహా మరో పది మంది కార్పొరేటర్లు సచివాలయంలో చంద్రబాబును కలిశారు.

mayor

గతంలో మేయర్‌ కటారి అనురాధ హత్యకు గురికావడంతో ఆ స్థానం నుంచి సమీప బంధువైన హేమలత ఏకగ్రీవంగా గెలుపొందారు. ఏప్రిల్‌ 15న చిత్తూరు కార్పొరేషన్‌ మేయర్‌ ఎన్నికలో హేమలత అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేయాలన్న కార్పొరేటర్ల విజ్ఞప్తిని ముఖ్యమంత్రి ఆమోదించారు.

చిత్తూరులో 50 మంది మమున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో 38 మంది కార్పోరేటర్లు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. తాజాగా గెలిచిన హేమలత, వసంత్ కుమార్‌తో కలిపి 38 మంది.

హేమలత, తన భర్త ప్రవీణ్‌తో కలిసి ఇటీవల ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిశారు. అమర్నాథ్ రెడ్డి 2014లో వైసిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టిడిపిలో చేరి, ఇటీవలే మంత్రి అయ్యారు.

ఆ సమయంలోనే అమర్నాథ్ రెడ్డి వారికి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీకే మేయర్ పోస్ట్ ఇస్తారని చెప్పారు. మేయర్ పోస్ట్ ఏకగ్రీవం చేసేందుకు అమర్నాథ్ రెడ్డి తనవంతు ప్రయత్నాలు చేశారు.

English summary
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu announced Chittoor Mayor candidate name on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X