చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంగీత కోసం కోల్‌కతాలో పిటిషన్, గంగిరెడ్డికి విదేశాల్లో 1000 కోట్ల ఆస్తులు!

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఎర్రచందనం దుంగలను గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలించడంలో చక్రం తిప్పిన లేడీ డాన్, మోడల్ సంగీతా చటర్జీని ఏపీకి తీసుకువచ్చేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమెను తమకు అప్పగించాలని చిత్తూరు పోలీసులు కోల్‌కతా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

గంగిరెడ్డి ఆస్తులు రూ.2వేల కోట్లు

కడప జిల్లాకు చెందిన ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డి ఆస్తుల విలువ రూ.2వేల కోట్ల వరకు ఉంటుందంటున్నారు. అతను అంతర్జాతీయ స్మగ్లర్ గా ఎదిగాడు. సీఎంగా చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అతడి ఆటలకు చెక్ పడింది.

లేడిడాన్‌ సంగీతా లాకర్‌ బద్దలు: రూ. 2కోట్లవిలువైన ఆస్తి జప్తు, కోల్‌కతాకు ఏపీ పోలీస్

దీంతో ఉన్నపళంగా దేశాన్ని వదిలి పరారైన గంగిరెడ్డి సింగపూర్‌లో తలదాచుకున్నాడు. ఏపీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. గంగిరెడ్డి అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఏపీ సర్కారు చర్యలు ప్రారంభించింది.

sangeeta chatterjee

కడప జిల్లాలోని తన సొంత మండలం పుల్లంపేట, పొరుగు మండలం రైల్వే కోడూరు తదితర ప్రాంతాల్లో అతడు విలువైన స్థలాలతో పాటు పల్వనైజింగ్ మిల్లులు, పెట్రోల్ పంపులు నడుపుతున్నట్లు తేలింది. వీటితో పాటు తిరుపతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాదుల్లో భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది.

కాల్‌మనీ దారుణం, రాడ్లతో కొట్టారు: స్మగ్లర్ భార్య సంగీత కోసం వెయిటింగ్!

వీటి విలువ రూ.2 వేల కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. చాలా కాలం పాటు విదేశాల్లో తలదాచుకున్న అతడు అక్కడ రూ.1,000 కోట్లకు పైగానే కూడబెట్టినట్లు చెబుతున్నారు. వీటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు.

English summary
Chittoor Police asks for Sangeeta Chatterjee custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X