వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా బిడ్డను చంపడానికి అనుమతివ్వండి.. కోర్టులో తల్లిదండ్రుల పిటిషన్

‘దీర్ఘకాల అనారోగ్యంతో నరకయాతన అనుభవిస్తోన్న మా బిడ్డ కష్టం చూడలేకపోతున్నాం.. వైద్యం చేయించేందుకు ఉన్నదంతా ఊడ్చిపెట్టాం.. చేతిలో చిల్లిగవ్వలేదు.. మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి..’- ఇది ఓ దంపత

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి:'దీర్ఘకాల అనారోగ్యంతో నరకయాతన అనుభవిస్తోన్న మా బిడ్డ కష్టం చూడలేకపోతున్నాం.. వైద్యం చేయించేందుకు ఉన్నదంతా ఊడ్చిపెట్టాం.. చేతిలో చిల్లిగవ్వలేదు.. మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి..' అంటూ నిరుపేద చేనేత కార్మిక దంపతులు బుధవారం మదనపల్లె ఏడీజే కోర్టు న్యాయమూర్తిని వేడుకున్నారు.

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం తెట్టు పంచాయతీ పులగూరవారిపల్లెకు చెందిన బొగ్గల చిన్నరెడ్డెప్ప, సునీత దంపతులకు ఇద్దరు ఆడబిడ్డలు, ఒక కుమారుడు. వీరి పెద్దకుమార్తె శృతిహాసన్‌(6) న్యూరోఫైబ్రోమా(నరాల బలహీనత)తో బాధపడుతోంది. ఈ బాలికకు మెడ నిలవదు. కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడంతో నిలబడలేదు.

Chittor Couple pleads for mercy killing of their daughter

బిడ్డ చికిత్స కోసం చిన్నరెడ్డెప్ప రూ.3 లక్షల వరకూ అప్పులు చేశాడు. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా ప్రయోజనం దక్కలేదు. నొప్పులు తట్టుకోలేక బిడ్డ రోదిస్తుండటం చూడలేకపోతున్నామని దంపతులు బావురుమన్నారు.

బుధవారం మదనపల్లె రెండో అదనపు జిల్లా కోర్టుకు చేరుకున్న వీరు తమ బిడ్డకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఆ అధికారం తమకు లేదని.. జిల్లా కోర్టు గానీ హైకోర్టులో గానీ సంప్రదించాలని న్యాయమూర్తి కె.వి.మహాలక్ష్మి సూచించారు. దీంతో ఆ దంపతులు బిడ్డతో నిరాశగా వెనుదిరిగారు.

English summary
Boggala Chinnareddeppa, Sunitha, The Couple of Pulagooravaripalle of Kurabalakota Mandal, chittor District filed a petition before the Magistrate of ADJ Court of Madanapalle seeking permission for mercy killing of their 6 year old daughter Sruthi Hassan. But the court is not granted the same and advised them to go to District Court or High Court in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X