వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రి కావాలి: వైయస్ జగన్‌ను కలిసిన చోటా కే నాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

వైయస్ జగన్‌ ముఖ్యమంత్రి కావాలి: చోటా కే నాయుడు

రాజమహేంద్రవరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు కలిశారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ యాత్రలో ఆయనను పలువురు ప్రముఖులు కలుస్తున్నారు.

జగన్! నాతో వస్తావా, మురళీమోహన్! హేళనగా ఉందా?: టీడీపీకి పవన్ దిమ్మతిరిగే సవాల్జగన్! నాతో వస్తావా, మురళీమోహన్! హేళనగా ఉందా?: టీడీపీకి పవన్ దిమ్మతిరిగే సవాల్

ఇటీవల పోసాని కృష్ణ మురళి, పృథ్వీరాజ్ తదితరులు కలిశారు. ఇప్పుడు చోటా కే నాయుడు కలిశారు. సోమవారం మండపేట నియోజకవర్గంలో జరుగుతున్న యాత్రలో జగన్‌తో కలిసి కాసేపు నడిచారు. ఆయనకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చోటా కే నాయుడు మాట్లాడుతూ సుపరిపాలన కావాలంటే జగన్ సీఎం కావాలన్నారు.

 Chota K Naidu meets YS Jagan in Praja Sankalpa Yatra

అమరణ దీక్ష, యువభేరి సభ పోరాటాలతో ప్రత్యేక హోదా మరుగున పడకుండా సజీవంగా ఉంచింది వైసీపీనే అని ఆ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం అన్నారు. నాటా ఉత్సవాల్లో భాగంగా వైసీపీ అమెరికా విభాగం ఆధ్వర్యంలో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఎన్నారైలతో నిర్వహించిన గ్రీట్‌ అండ్‌ మీట్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

పదవులకన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, హోదా కోసం లోకసభ సభ్యత్వాలను తృణప్రాయంగా త్యజించామన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసి 15 ఏళ్లు హోదా ఇస్తామని నమ్మించి మోసం చేశాయని మిథున్ రెడ్డి విమర్శించారు. తాము రాజీనామా చేసిన స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే ప్రజల ఆకాంక్షలను కేంద్రానికి తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్‌ యాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే ఆయన సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు.

English summary
Cinematographer Chota K Naidu met YSR Congress Party chief YS Jagan Mohan Reddy in Praja Sanklpa Yatra in East Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X