తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమలలో అన్యమత ప్రచారం చేశా!: షాకింగ్ వీడియో

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు/హైదరాబాద్: ఏడు కొండలవాడు కొలువై ఉన్న తిరుమలలో మత ప్రచారం యథేచ్ఛగా కొనసాగుతోందనే విమర్శలు ఎప్పటి నుండో ఉన్నాయి. ఇందుకు నిదర్శనంగా పలుమార్లు ఇతర మతాలకు చెందిన వారు ప్రచారం చేస్తుండగా అదుపులోకి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల తాను తిరుమలలో మత ప్రచారం చేశానని ఓ వ్యక్తి 17 నిమిషాల నిడివి గల వీడియోలు యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశాడు. సదరు వ్యక్తి తనను హైదరాబాదుకు చెందిన సుధీర్‌గా పరిచయం చేసుకున్నాడు.

Christian campaign in Tirumala again

తిరుమలలో భద్రతను ఎద్దేవా చేశాడు. బ్రహ్మోత్సవాల సమయంలో ఐదువేల మంది పోలీసు భద్రతలోను తాను మత ప్రచారం చేశానని పేర్కొన్నాడు. వెంకన్న భక్తులు మోసపోతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అతను అలిపిరి నుండి ఆలయం వరకు ప్రచారం సాగింది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/qxp7Ve1lqao?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

తిరుమలేశుడి పైన సుధీర్ వ్యాఖ్యల పైన భక్తులు మండిపడుతున్నారు. అతను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో.. తిరుమలేశుడి వద్ద ఇంత అపచారం జరుగుతున్నా, యథేచ్చగా మత ప్రచారం సాగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు.

English summary
Christian campaign in Tirumala again
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X