వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కల్యాణ్‌పై క్రైస్తవ సంఘాల గుర్రు, హిందూ అనుకూల కామెంట్లపై ఫైర్, రాజు రవితేజ్ కూడా..

|
Google Oneindia TeluguNews

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు మండిపడుతున్నారు. పవన్ హైందవ ధర్మం గురించి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ పుణ్య క్షేత్రాల్లో అన్య మత ప్రచారం పెరుగుతున్న తీరు గురించి పవన్ కల్యాణ్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. విజయవాడ పుష్కర ఘాట్‌లో సామూహికంగా బాప్టిజమ్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు.

మత మార్పిడులపై గుర్రు

మత మార్పిడులపై గుర్రు

తిరుమల శ్రీవారి దర్శించుకొన్న తర్వాత తిరుపతిలో మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏమి చేస్తోందని ప్రశ్నించారు. మత మార్పిడిలపై ప్రశ్నించారు. అంతేకాదు దీని వెనక ఎవరి హస్తం ఉందని ఆరోపించారు. మత మార్పిడిల ప్రక్రియ సీఎం జగన్ నివాసానికి సమీపంలో జరుగుతున్నాయనడంతో నేరుగా ఆయననే టార్గెట్ చేశారని తెలుస్తోంది. మరోవైపు మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అన్యమత ప్రచారానికి అభ్యంతరం చెప్పడంతోనే పదవీనుంచి తప్పించారని ప్రచారం జరుగుతుంది. అన్యమతంపైనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ తరహాలో పవన్ కల్యాణ్ వెళ్తున్నారని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

 నేతలతో కూడా..

నేతలతో కూడా..

తామే కాకుండా జనసేన క్రైస్తవ నేతలతో పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు చేయిస్తున్నారు. మత సంబధం వ్యాఖ్యలపై వారం రోజుల కింద ఆలివర్ రాయ్ విశాఖపట్టణం పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆలివర్ రాయ్ భీమిలీలో జనసేన పార్టీ తరఫున పనిచేశారు. అంతేకాదు క్రైస్తవ పాస్టర్ల సంఘంతో ఆలివర్ రాయ్ యాక్టివ్‌గా ఉంటారు.

 రాజు రవితేజ్ కూడా..

రాజు రవితేజ్ కూడా..

ఆలివర్ రాయే కాదు.. పవన్ కల్యాణ్ సన్నిహితుడు.. జనేసన పార్టీ ప్రకటించినప్పటీ నుంచి వెన్నంటే ఉన్న రాజు రవితేజ్ కూడా రాజీనామా చేశారని గుర్తుచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జమ్మికుంటకు చెందిన రవితేజ్‌కు క్రైస్తవ మిషనరీ సంస్థలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రవితేజ్ తండ్రి, సోదరుడు కూడా పాస్టర్లుగా ఉన్నారు. జమ్మికుంట, జనగామ ప్రాంతాల్లో క్రైస్తవ సంస్థలకు రవితేజ్ సలహాదారుడిగా కూడా ఉన్నారు.

హిందూత్వ అనుకూలం

హిందూత్వ అనుకూలం

పవన్ కల్యాణ్ హిందూత్వ అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాను పొగడటంపై రవితేజ్ విభేదించారు. రవితేజ్‌పై మిషనరీ సంస్థలు ఒత్తిడి చేశాయని తెలుస్తోంది. పార్టీ నుంచి బయటకు రావాలని ఒత్తిడి చేశాయని, బయటకొచ్చాక విమర్శలు చేయడంలో కీ రోల్ పోషించాయని తెలుస్తోంది. అయితే రవితేజ్ వ్యాఖ్యలపై జనసేనాని పవన్ కల్యాణ్ ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం. రవితేజ్ ఆయన కుటుంబనికి ‘జగన్మాత ఆశీస్సులు ఉండాలి... శుభం కలగాలి' అని పేర్కొన్నడం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
christian missionaries fire on janesena chief pawan kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X