వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్సమ్మ భూములు: జగన్ పార్టీ నేతలకు సీఐడీ కోర్టు సమన్లు

వివాదాస్పద మిస్సమ్మ భూముల విషయంలో సీఐడీ కోర్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సమన్లు జారీచేసింది. మిస్సమ్మ భూములపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. అనంతపురం కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది.

|
Google Oneindia TeluguNews

అనంతపురం: జిల్లాలోని వివాదాస్పద మిస్సమ్మ భూముల విషయంలో సీఐడీ కోర్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సమన్లు జారీచేసింది. మిస్సమ్మ భూములపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. అనంతపురం కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది.

దీంతో న్యాయస్థానం కడప జిల్లా పులివెందులకు చెందిన వైయస్‌ ప్రకాశ్‌రెడ్డికి అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్నాథ్‌రెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, రెడ్డప్పరెడ్డిలకు సమన్లు జారీచేసింది.

CID court issues summons to YSRCP leaders in missamma land issue

కాగా, గతంలో తనపై ఆరోపణలు వచ్చిన సమయంలో.. మిస్మమ్మ భూములపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రె పార్టీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో తన కుటుంబం అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని గురునాథరెడ్డి స్పష్టం చేశారు.

ఈ విషయంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని గురునాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే వరదాపురం సురి అక్రమాల చిట్టా ప్రజలందరికీ తెలుసునని అన్నారు. పార్టీ మారుతున్నట్టు తనపై దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణం ఉన్నంతవరకు జగన్‌ వెంటే ఉంటానని స్పష్టం చేశారు.

English summary
CID court issued summons to YSRCP leaders in missamma land issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X