వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఐడీ .. ఈడీ.. ఐటీ... ముప్పేట దాడులతో టీడీపీ లో టెన్షన్

|
Google Oneindia TeluguNews

ఏపీ టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. అధికార పార్టీతో పోరాటం చెయ్యటమే కాకుండా ఆత్మ రక్షణ చేసుకునే పనిలో ఉంది టీడీపీ . ఇప్పటికే టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ ఏపీలో కొనసాగుతున్న దాడులు పార్టీ కీలక నాయకుల్లో వణుకు పుట్టిస్తున్నాయి . ఒక పక్క ఏపీలో టీడీపీ నేతల ఇళ్ళపై ఏసీబీ దాడులు , మరో పక్క అమరావతి భూముల ఇన్సైడర్ ట్రేడింగ్ పై సిఐడీ కేసులు , అంతేకాక ఈడీ, ఐటీ ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు రాజ్యాంగ బద్ధ సంస్థలన్నీ ముప్పేట దాడులు చెయ్యటం టీడీపీలో టెన్షన్ కు కారణం అవుతుంది.

బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కు భారీ షాక్ ... ఆస్తుల జప్తుకు నోటీసులుబాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కు భారీ షాక్ ... ఆస్తుల జప్తుకు నోటీసులు

 టీడీపీ లోనూ, అధినేత చంద్రబాబులోనూ ఐటీ దాడుల

టీడీపీ లోనూ, అధినేత చంద్రబాబులోనూ ఐటీ దాడుల

ఆందోళన
అటు కేంద్ర , రాష్ట్ర సంస్థలు టీడీపీ నాయకులపై దృష్టి పెడుతున్న పరిస్థితులు టీడీపీని కుదేలు చేస్తున్నాయి. తాజా పరిణామాలపై ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ వెళ్లి ఎన్టీఆర్ భవన్ కు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండితీవ్ర సమాలోచనలు చేశారని సమాచారం . ఇక తమ పార్టీ నేతలను ఏ విధంగా కాపాడుకోవాలి, ఎలా పార్టీ ని ముందుకు తీసుకువెళ్ళాలి అని ఆయన ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది . ఇక తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాల తనిఖీలు ఇప్పుడు టీడీపీ శిబిరంలో ఆందోళనకు కారణమవుతున్నాయి.

ఏపీ, తెలంగాణలో ఏకకాలంలో సాగుతున్న ఢిల్లీ ఐటీ బృందాల దాడులు

ఏపీ, తెలంగాణలో ఏకకాలంలో సాగుతున్న ఢిల్లీ ఐటీ బృందాల దాడులు

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పీఏగా పనిచేసిన శ్రీనివాస్ రావుపై ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాలు దాడి చేశాయి. మాజీ మంత్రి లోకేష్ చంద్రబాబు సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్న పరిస్థితులు చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి . ఏపీ, తెలంగాణలో ఏకకాలంలో సాగుతున్న ఢిల్లీ ఐటీ బృందాల దాడులతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో 150 కోట్ల ముడుపుల లెక్క

చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో 150 కోట్ల ముడుపుల లెక్క

చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లో, విజయవాడ, హైదరాబాద్ లలో ఆయన ఆస్తులపైనా ఢిల్లీ ఐటీ బృందాలు సోదాలు చేశాయి . విజయవాడ గాయత్రినగర్ లో సోదాల్లో రహస్య లాకర్ నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇందులో టీడీపీకి చెందిన ముఖ్యనేతకు ఇచ్చిన 150 కోట్ల ముడుపుల లెక్క ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇక ఈ లెక్కలు ముంబైకి చెందిన ఓ కాంట్రాక్ట్ సంస్థ ఇచ్చిన లెక్కలని సమాచారం.

జీఎస్టీ ఇంటెలిజెన్స్ అదుపులో కిలారీ రాజేశ్, నరేన్ చౌదరి?

జీఎస్టీ ఇంటెలిజెన్స్ అదుపులో కిలారీ రాజేశ్, నరేన్ చౌదరి?


ఇక అంతేకాదు తాజాగా కిలారు రాకేష్ పై కూడా ఐటీ శాఖ దాడులు చేసింది. ఆయన వందల కోట్ల ఐటీ రిటర్న్స్ లో అవకతవకలకు పాల్పడినట్టుగా సమాచారం . లోకేష్ బినామీగా కిలారి రాజేష్ పై ప్రచారం ఉంది . లోకేష్ కు అత్యంత సన్నిహితులుగా పేరొందిన కిలారీ రాజేశ్, నరేన్ చౌదరిలను జీఎస్టీ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారవర్గాలు మాత్రం అధికారికంగా స్పందించలేదు. కానీ టీడీపీ శిబిరంలో రాజ్యాంగ బద్ధ సంస్థల ముప్పేట దాడితో టీడీపీలో టెన్షన్ నెలకొంది .

English summary
The AP TDP situation is worse. TDP is not only fighting with the ruling party but also protecting them self. The ongoing attacks on the AP are already shaking the party's key leaders, targeting TDP leaders. The ACB attacks on the houses of the TDP leaders on one side, the CID cases on the insider trading of Amravati lands on the other side, ED and IT. constituent bodies attacks are causing tension in the TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X