వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వోల్వో ప్రమాదం: బస్సుతో ప్రయోగాత్మకంగా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అక్టోబర్ 30వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో జాతీయ రహదారి పైన జరిగిన వోల్వో బస్సు ప్రమాదంపై సిఐడి అధికారులు సోమవారం దర్యాఫ్తు నిర్వహించారు. వోల్వో బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 45 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదాన్ని ప్రభుత్వం సిఐడి విచారణకు అప్పగించింది. దీంతో వారు సోమవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సిఐడి డిఐజి రవిచంద్ర నేతృత్వంలో బృందం వివరాలు సేకరించింది. వోల్వో బస్సు కల్వర్టును ఢీకొన్న తీరును, మంటలు వ్యాపించడానికి గల కారణాలు, బస్సు దహనమైన ప్రదేశాన్ని వారు క్షుణ్ణంగా పరిశీలించారు.

వోల్వో బస్సు ప్రమాదంపై సోమవారం స్వీడన్‌కు చెందిన నిపుణులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బస్సు ఢీకొట్టిన కల్వక్టును పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును వారు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. మొదట బస్సు టైరును తెచ్చి ప్రమాదాన్ని అంచనా వేశారు. ఓ ప్రయివేటు బస్సును వారు తీసుకు వచ్చి డివైడర్ పైకి ఎక్కించి కల్వర్టును ఢీకొట్టిన విధానాన్ని అంచనా వేశారు. బస్సు వేగాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. వీరి వెంట వోల్వో కంపెనీ ప్రతినిధులు ఉన్నారు.

వోల్వో 1

వోల్వో 1

మహబూబ్ నగర్ జిల్లా పాలెం సమీపంలో అక్టోబర్ 30న జరిగిన వోల్వో బస్సు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలిస్తున్న నిపుణుల బృందం. బస్సు కల్వర్టును ఢీకొన్న తీరును వారు పరిశీలించారు.

వోల్వో 2

వోల్వో 2

మహబూబ్ నగర్ జిల్లా పాలెం సమీపంలో ప్రమాదం జరిగిన కల్వర్టు పైకి మరో వోల్వో బస్సును ఎక్కించి అధికారులు పరిశీలిస్తున్న దృశ్యం.

వోల్వో 3

వోల్వో 3

మహబూబ్ నగర్ జిల్లా పాలెం సమీపంలో జరిగిన ప్రమాదంలో దగ్ధమైన బస్సును పరిశీలిస్తున్న నిపుణులు. ఈ ప్రమాదంలో 45 మంది ప్రయాణీకులు మృతి చెందారు.

వోల్వో 4

వోల్వో 4

మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ప్రమాద ఘటనపై దర్యాఫ్తు కొనసాగుతోంది. సిఐడి బృందం సోమవారం ఘటన ప్రాంతాన్ని పరిశీలించింది.

వోల్వో 5

వోల్వో 5

బస్సులో సజీవదహనమైన వారు మంటలు అంటుకున్న రెండు నిమిషాల్లోనే మరణించినట్లుగా క్లూస్ టీం నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. మంటలు వ్యాపించిన క్షణాల్లోనే కార్పన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ పెద్ద ఎత్తున ఉత్పత్తయ్యాయి.

English summary
The CID investigation team visited Volvo bus accident place near Palem of Mahaboobnagar district on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X