జే బ్రాండ్ లిక్కర్ స్కామ్, జగన్ పార్టీ ఎంపీకి సీఐడీ షాక్?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాల గురించి పూర్తి సమాచారం బయటకు లాగుతుంది. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు చేసిన మద్యం స్కామ్ అక్రమాల గురించి ఎన్డీఏ ప్రభుత్వం సమాచారం సేకరిస్తుంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి ఎన్డీఏ ప్రభుత్వం కూపీలాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో ఇంతకాలం విక్రయించిన నాసిరకం లిక్కర్ బ్రాండ్ల మద్యం మొత్తం అప్పటి వైసీపీ నాయకులు తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పూర్తి సమాచారం బయటకు లాగుతుంది. ఇదే సమయంలో సీఐడీ అధికారులు ఆంధ్రప్రదేశ్ లోని సుమారు 20 డిస్టిలరీల కంపెనీలపై దాడులు చేసి సోదాలు చేసి పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు సీజ్ చేశారు.

CID officials have seized the records of about 20 distilleries in Andhra Pradesh

గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ కంపెనీలలో అక్రమ వ్యవహారాలు జరిగాయని ఆరోపణలు రావడంతో సీఐడీ అధికారులు సోదాలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలలో ఆ పార్టీ నాయకులు డిస్టిలరీలను లీజ్ కు తీసుకున్నారని, కొన్ని డిస్టిలరీలను కబ్జా చేసి నాసిరకం మద్యం తయారుచేసి సరఫరా చేశారని, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంలోనే సీఐడీ అధికారులు ఆ డిస్టిరీలస్ కంపెనీలలో మంగళవారం అర్దరాత్రి వరకు తనిఖీలు చేశారు.

CID officials have seized the records of about 20 distilleries in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లో సీఐడీ అధికారులు పరిశీలించారు. ఆ సంస్థను రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆధీనంలోకి తీసుకుని నాసిరకం మద్యం తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కంపెనీని ఏసీకి చెందిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సబ్ లీజ్ కు తీసుకుని సొంతంగా జే బ్రాండ్ల మద్యం తయారు చేసి ఆంధ్రప్రదేశ్ లో సరఫరా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో అధికారులు కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి జగన్ ప్రభుత్వంలో నాసిరకం మద్యం అమ్మారని అధికారులు గుర్తించారు.

గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన నాయకులే కొన్ని భోగస్ కంపెనీల పేరుతో నాసిరకం మద్యం తయారు చేసి విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి. నంద్యాలో కూడా ఇలాంటి నాసిరకం మద్యం తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయి.ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల మండలంలోని గండేపల్లి సెంటనీ బయోటెక్ కంపెనీ కూడా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆధీనంలో ఉండేదని, ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి మద్యం బాటిలింగ్ యూనిట్ ను సీఐడీ అధికారులు పరిశీలించారు.

CID officials have seized the records of about 20 distilleries in Andhra Pradesh

ప్రకాశం జిల్లాలోని పాత సింగరాయకొండ లోని పెరల్ డిస్టిరీల కంపెనీలో సీఐడీ అధికారులు సోదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు డిస్టిరీల కంపెనీల వివరాలు సేకరిస్తున్నారు. తిరుపతి సమీపంలోని రేణిగుంటలోని ఎస్వీఆర్ డిస్టిలరీస్ కూడా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆధీనంలో ఉండేదని, అక్కడా జే బ్రాండ్ లిక్కర్ తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. సుమారు 20 డిస్టిలరీస్ లో సోదాలు చేసిన సీఐడీ అధికారులు పలు రికార్డులు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు సీజ్ చేసి విచారణ చేస్తున్నారు. ఇప్పటికే సీఐడీ అధికారులు పలు కీలక సమాచారం సేకరించారని తెలిసింది. ఈ కంపెనీల పేరుతో సుమారు రూ 8 వేల కోట్ల విలువైన మద్యం అప్పటి జగన్ ప్రభుత్వానికి సరఫరా చేశారని ఆరోపణలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+