వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనసున్న పవన్ కళ్యాణ్‌తో పోలిక: మంత్రి అనిల్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన ఇది

|
Google Oneindia TeluguNews

అమరావతి: టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా ప్రముక సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సర్కారుపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు పవన్ వ్యాఖ్యలకు ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది.

పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లను చాలా మందిని చూశామన్న అనిల్

పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లను చాలా మందిని చూశామన్న అనిల్

తాజాగా, ఏపీ మంత్రి అనిల్ కుమార్.. పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రభుత్వానికి పెద్ద హీరో అయినా.. చిన్న హీరో అయినా ఒకటేనని అన్నారు. పవన్ కళ్యాణ్ కోసం తాము ఇండస్ట్రీని భయపెట్టాలా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి అని ప్రశ్నించారు. మొన్న జరిగిన జడ్పీటీసీ/ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఒక మండలంలో గెలిచారన్నారు. ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లే సరికి పార్టీ చాప చుట్టేస్తుందని ఎద్దేవా చేశారు మంత్రి అనిల్ కుమార్. ఇలాంటి వాళ్లను ప్రభుత్వం చాలా మందిని చూసిందని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఆ ఉద్దేశంతోనే సీఎం జగన్ నిర్ణయమన్న మంత్రి అనిల్

ఆ ఉద్దేశంతోనే సీఎం జగన్ నిర్ణయమన్న మంత్రి అనిల్


సోషల్ మీడియాలో వాళ్లకు అభిమానులు ఉంటారు. వాళ్లు ట్రోలింగ్ చేయడం మొదలు పెడతారు. మా గురించి ఎన్ని ట్రోల్ చేస్తారో చేసుకోండి. మమ్మల్ని తలుచుకుంటున్నందుకు ధన్యవాదాలు. కేవలం ఆయన(పవన్)ను దృష్టిలో పెట్టుకుని సినిమా పరిశ్రమను ఎందుకు ఇబ్బంది పెడతామన్నారు. అసలు ఆయనెవరు? ఆయన వాదనల్లో పొంతనలేదన్నారు. తమకు డబ్బులు కావాలంటే టికెట్ రేట్లు పెంచుతాం కదా? కానీ, అలా చేయడం లేదని చెప్పారు. సినిమా థియేటర్లు ఏమైనా మూసేశామా? రేట్లు పెంచి అమ్మే టికెట్లపై ట్యాక్స్ ఎక్కడికిపోతోంది. అని ప్రశ్నించారు. ఈ ఉద్దేశంతోనే
సీఎం జగన్ ఆన్‌లైన్ టికెటింగ్‌పై నిర్ణయం తీసుకున్నారని మంత్రి అనిల్ తెలిపారు. దీనిలో తప్పేముంది? అదే రూ. 200 పెట్టి పోర్టల్‌లో టికెట్లు అమ్మడం ప్రతిదీ పారదర్శకంగా జరగాలనుకోవడం తప్ప అని ప్రశ్నించారు.

పవన్ అయినా.. సంపూర్ణేష్ బాబు అయినా అంటూ..

పవన్ అయినా.. సంపూర్ణేష్ బాబు అయినా అంటూ..

అంతేగాక, ప్రభుత్వానికి ఏ హీరో సినిమా అయినా ఒక్కటే. తామంతా కళామతల్లి ముద్దు బిడ్డలం అని మీరే చెబుతారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అయినా.. సంపూర్ణేష్ బాబు అయినా మాకు ఒకటే.. హీరోగా ఇద్దరి కష్టం ఒకటే.. సిక్స్ ప్యాక్ చేసేందుకు సుధీర్ బాబు, ప్రభాస్ ఇద్దరూ ఒకేలా కష్టపడ్డారు. టికెట్ రేటు అనేది పెద్దవాడికి ఒకలా.. చిన్నవాడికి మరోలా ఉండకూడదన్నారు. ఇద్దరికీ సమానంగా ఉండలని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. నాకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు.. రూ. 100 టికెట్.. రూ. 200కు కొనండి అని ఎవరైనా చెబుతారా? అని ప్రశ్నించారు. అలా అయితే, దాన్ని క్యాష్ చేసుకోవడం అంటారని చెప్పారు మంత్రి అనిల్ కుమార్.

Recommended Video

Why Love Story Is A Must Watch | Naga Chaitanya, Sai Pallavi కెరీర్ బెస్ట్ || Oneindia Telugu
మంచి మనసున్న పవన్ కళ్యాణ్‌తో పోలికపై సంపూర్ణేష్ బాబు స్పందన

మంచి మనసున్న పవన్ కళ్యాణ్‌తో పోలికపై సంపూర్ణేష్ బాబు స్పందన

ఇది ఇలావుండగా, మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యలపై సినీనటుడు సంపూర్ణేష్ బాబు స్పందించారు. 'మంత్రి అనిల్ గారు.., మంచి మనసున్న మా పవన్ కళ్యాణ్ గారితో సమానంగా నన్ను చూడటం ఆనందకరం. ఏ సమస్య వచ్చినా పెద్ద మనసుతో స్పందించే తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు బాధలో ఉన్నారు. అదే పెద్ద మనసుతో అవి పరిష్కారం అయ్యేలా చూడగలరు' అని సంపర్ణేష్ బాబు ట్విట్టర్ వేదికగా కోరారు.

English summary
Cine Actor Sampoornesh Babu response on AP minister Anil Kumar's comments compared him with pawan kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X