వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకేమైనా బుర్రలేదా?, అప్పుడే మోడీని మర్చిపోరు: హోదాపై సుమన్ సంచలనం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు బాగుండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా.. తెలుగు ప్రజలుగా ఒకరికి ఒకరం అన్నట్లుగా ఉండాలని సుమన్ ఆకాంక్షించారు.

విభజనకు ముందు ఏపీలోని ధనవంతులు హైదరాబాద్‌లో విద్యా, వ్యాపారాలు పెట్టడంతో ఏపీలోని సామాన్య ప్రజలు కూడా ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విభజన తర్వాత ఏపీ బాగా అభివృద్ధి చెందుతోందని, విద్యా, వ్యాపార సంస్థలు ఏపీలో వెలుస్తున్నాయని సుమన్ చెప్పారు. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య పెళ్లిళ్లు, వ్యాపారాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు.

Recommended Video

అవిశ్వాసానికి మద్దతుగా ఆందోళనకు స్వస్తిపలికిన టిఆర్ఎస్
హోదా అంటే ఏంటీ? ఏం చేయాలి?

హోదా అంటే ఏంటీ? ఏం చేయాలి?

రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయొద్దని సుమన్ సుమన్ అన్నారు. మొదట ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబే అడిగారని.. దానిపై మోడీతో బాబు ఏం మాట్లాడారో ఎవరికైనా చెప్పారా? అని ప్రశ్నించారు. హోదా గురించి తనకు కూడా తెలియదని, ఎంతమందికి తెలుసని ప్రశ్నించారు. హోదా అంటే ఏంటో తెలిసేలా రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు అంటించాలని అన్నారు. తాను ఏపీకి మేలు చేస్తుందనుకుంటే హోదాకు మద్దతు తెలుపుతానని అన్నారు.

చంద్రబాబుకేమైనా బుర్రలేదా?

చంద్రబాబుకేమైనా బుర్రలేదా?

మొదట హోదా కావాలని అడిగిన చంద్రబాబు.. అది సాధ్యం కాకపోవడంతో ఆ తర్వాత ప్యాకేజీకి ఒప్పుకున్నారని సుమన్ అన్నారు. చంద్రబాబుకు ఏమైనా బుర్రలేదా? ఆయనకు అన్ని అంశాలపై ఎంతో అవగాహన ఉందని.. మొదట ప్యాకేజీ తీసుకుని.. ఆ తర్వాత హోదా కోసం పోరాటం చేయాలని ఆలోచించి ఉంటారని సుమన్ అన్నారు.

అప్పుడే కేసీఆర్ అంటే ఏంటో అర్థమైంది, ఆ పిలుపు కోసం: సుమన్ అప్పుడే కేసీఆర్ అంటే ఏంటో అర్థమైంది, ఆ పిలుపు కోసం: సుమన్

హోదా ఏమైనా మార్కెట్లో దొరుకుందా?

హోదా ఏమైనా మార్కెట్లో దొరుకుందా?

హోదా కావాలి.. హోదా కావాలి.. అంటే అదేమైనా మార్కెట్లో దొరుకుతుందా? అని సుమన్ ప్రశ్నించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అన్ని మాట్లాడుకుని ఇప్పుడు పోరాటం అంటే ఎలా అని అన్నారు. తాము రాజకీయాల్లో లేమని, అయినా తెలుగు ప్రజలకు అండగా ఉంటామని సుమన్ స్పష్టం చేశారు.

మోడీ.. ఏపీ ప్రజలను సంతోషపెట్టేలా.. సుమన్ వేడుకోలు

మోడీ.. ఏపీ ప్రజలను సంతోషపెట్టేలా.. సుమన్ వేడుకోలు

బీజేపీతో విడిపోయిన తర్వాత వీళ్లు అరుస్తున్నారని, ఎన్నికలకు ఒకటిన్నరేళ్లు ఉండగా ఇప్పుడే ఎందుకు పోరాటం చేస్తున్నారని సుమన్ ప్రశ్నించారు. తాను ప్రధాని నరేంద్ర మోడీకి ఓ రిక్వెస్ట్ చేస్తున్నానని.. ‘రూల్స్ పక్కన పెట్టండి.. మనసుంటే మార్గం ఉంటుంది.. ఏపీ ప్రజలను సంతోషపెట్టేలా ఏదైనా చేయండి.. హోదా ప్రకటిస్తే ఏపీ ప్రజలు మిమ్మల్ని(మోడీని) ఎప్పటికీ మర్చిపోరు. ఏపీని అభివృద్ధి చేయండి' అని సుమన్ వ్యాఖ్యానించారు.

మోడీ వద్దకు వెళ్తాం.. అరుస్తాం

మోడీ వద్దకు వెళ్తాం.. అరుస్తాం

లేదంటే.. ఇక అరుస్తూనే ఉంటామని సుమన్ చెప్పారు. ఏపీలో అరిస్తే ఏం లాభం లేదని.. ఢిల్లీకి వెళ్లి అరుద్దామని పార్టీలకు సుమన్ పిలుపునిచ్చారు. హోదా కోసం సినీ ఇండస్ట్రీ కూడా ఢిల్లీకి వెళ్తుందని చెప్పారు. ఓ తేదీని ఫిక్స్ చేయి.. సినీ ఇండస్ట్రీ మొత్తం ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోడీని కలిసి ఏపీ న్యాయం చేయాలని కోరతామని అన్నారు. ఇందుకు అందరూ సహకరించాలని అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోడీ వద్దే ఉంటామని అన్నారు. ఆయన ఏపీకి హోదా ఇస్తే మంచిది లేదంటే తిరుగుపయనం కావాల్సిందే అని అన్నారు. అయితే పోరాటం మాత్రం చేస్తూనే ఉంటామని అన్నారు.

English summary
Cine Actor Suman on Wednesday responded on Andhra Pradesh special status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X