వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాణీ విశ్వనాథ్ నాకు పోటీయే కాదు, రాజకీయాలు ఆషామాషీ కాదు: రోజా

సినీ నటి వాణి విశ్వ‌నాథ్ త‌న‌కు పోటీ అవుతారని తాను అనుకోవడం లేదని వైసీపీ ఎమ్మెల్యే సినీ నటి రోజా అభిప్రాయపడ్డారు.గురువారం నాడు ఆమె ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: సినీ నటి వాణి విశ్వ‌నాథ్ త‌న‌కు పోటీ అవుతారని తాను అనుకోవడం లేదని వైసీపీ ఎమ్మెల్యే సినీ నటి రోజా అభిప్రాయపడ్డారు.గురువారం నాడు ఆమె ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రకటించారు.

సినీ నటి వాణీ విశ్వనాథ్ టిడిపిలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే చిత్తూరు జిల్లాలోని నగరి అసెంబ్లీ నియోజకర్గం నుండి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై వాణీ విశ్వనాథ్‌ను రంగంలోకి దింపుతున్నారనే ప్రచారం కూడ సాగుతోంది.అయితే వాణీ విశ్వనాథ్ ఇంకా చంద్రబాబునాయుడును కలుసుకొని ఈ విషయాన్ని చర్చించాల్సి ఉంది.

చిత్తూరు జిల్లాలోని నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు బరిలోకి దిగారు. వైసీపీ తరపున రోజా పోటీ చేసి విజయం సాధించారు.

వాణీ విశ్వనాథ్ పోటీయా

వాణీ విశ్వనాథ్ పోటీయా

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై వాణీ విశ్వనాథ్‌ను 2019 ఎన్నికల్లో బరిలోకి దింపుతారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలను వైసీపీ ఎమ్మెల్యే రోజా కొట్టిపారేశారు. వాణీ విశ్వనాథ్ తనకు పోటీ అవుతోందని తాను అనుకోవడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. తాను ఎన్నో విష‌యాల‌పై పోరాడి రాజ‌కీయంగా ఎన్నో ఒడిదుడుకుల‌ను చూశానని రోజా అభిప్రాయపడ్డారు.

వాణీ విశ్వనాథ్ అందుకే టిడిపిలో

వాణీ విశ్వనాథ్ అందుకే టిడిపిలో

ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉన్నందున వాణీ విశ్వనాథ్‌ టిడిపిలో చేరాలని భావిస్తున్నారని రోజా అభిప్రాయపడ్డారు. రాజకీయాలంటే ఆషామాషీ కాదని రోజా అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి వస్తేనే అసలు విషయాలు తెలుస్తాయని రోజా అన్నారు.

నగరి నుండి వాణీ విశ్వనాథ్ పోటీ చేసేనా?

నగరి నుండి వాణీ విశ్వనాథ్ పోటీ చేసేనా?

నగరి అసెంబ్లీ స్థానం నుండి వాణీ విశ్వనాథ్ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ స్థానం నుండి గత ఎన్నికల్లో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు పోటీ చేశారు. స్వల్ప ఓట్ల తేడాతో రోజాపై విజయం సాధించారు. అయితే గాలి ముద్దుకృష్ణమనాయుడు ఈ నియోజకవర్గం ఇంఛార్జీగా కొనసాగుతున్నారు. ఇటీవలనే గాలి ముద్దుకృష్ణమనాయుడుకు ఎమ్మెల్సీ పదవిని టిడిపి కేటాయించింది.

ముద్దుకృష్ణమనాయుడు ఎక్కడ నుండి పోటీ చేస్తారు

ముద్దుకృష్ణమనాయుడు ఎక్కడ నుండి పోటీ చేస్తారు

నగరి నుండి వాణీ విశ్వనాథ్‌ను టిడిపి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపితే గాలి ముద్దు కృష్ణమనాయుడు ఎక్కడి నుండి బరిలోకి దిగుతారనే విషయమై చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ లాంటి పదవులపై ముద్దుకృష్ణమనాయుడు పెద్దగా ఆసక్తిని చూపించరు. అంతేకాదు ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి చట్టసభల్లోకి అడుగుపెట్టాలనేది ముద్దుకృష్ణమనాయుడు అభిమతం. అయితే ముద్దు కృష్ణమనాయుడును కాదని వాణీ విశ్వనాథ్‌కు టిక్కెట్ కేటాయిస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గాలిని నగరి నుండి తప్పిస్తే ఆయనను ఏ స్థానం నుండి పోటీకి దింపుతారనే విషయమై చర్చ కూడ సాగుతోంది. మరో వైపు గాలికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించినందున వాణీ విశ్వనాథ్‌కు ఈ స్థానం నుండి పోటీకి మార్గం సుగమైందనే అభిప్రాయపడేవారు కూడ లేకపోలేదు.

English summary
Tollywood cine actress Vani viswanath not competitor for me said Ysrcp Mla Roja. Roja interviewed a Telugu news channel on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X