వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపి కి సినిమా గ్లామ‌ర్..! త్వ‌ర‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌నున్న‌ తార‌లు..!!

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : ఆంద్ర‌ప్రదేశ్ ప్ర‌తిప‌క్ష వైసీపి లో సిని గ్లామ‌ర్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సినిమా స్టార్ల‌ని ప్ర‌చారానికి ఉప‌యోగించుకోవాల‌ని వైసీపి స‌న్నాహాలు కూడా చేస్తోంది. గ్రామీణ వాతావ‌ర‌ణంలో సినిమా తార‌ల‌కు ఎక్కువ ఆద‌ర‌న ఉంటుంది కాబ‌ట్టి రాబోవు సాధార‌ణ ఎన్నిక‌ల్లో సినిమా తార‌ల‌తో ప్ర‌చారం చేయించాల‌న్న‌ది వైసిపి అదిష్టానం వ్యూహంగా తెలుస్తోంది. ఈ సారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధించి, అధికారం చెపట్టాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు చ‌ర్చ జ‌రుగుతోంది.

 గెలుపే ల‌క్ష్యంగా వ్యూహాలు..! సినీ గ్లామ‌ర్ ని వాడుకుందామ‌న్న జ‌గ‌న్..!!

గెలుపే ల‌క్ష్యంగా వ్యూహాలు..! సినీ గ్లామ‌ర్ ని వాడుకుందామ‌న్న జ‌గ‌న్..!!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌ణాళికలు ర‌చిస్తున్నారు. అందుకోసం ఆయన విరామం లేకుండా పని చేస్తున్నారు. ఒకవైపు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తూనే.. మరోవైపు, పార్టీ కార్యక్రమాలు, చేరికలు, ఇతర వ్యవహారాలపై దృష్టి సారించారు. వీటితో పాటు ప్రచారానికి సంసిద్ధమయ్యారు. ‘సమరశంఖారావం' పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ సభలను నిర్వహించనున్నారు. ఇందుకోసం సినీ తార‌ల ప్ర‌చారాన్ని ఉప‌యోగించుకోవాల‌ని జ‌గ‌న్ యోచిస్తున్న‌ట్టు స‌మాచారం.

వ‌చ్చే ఎన్నిక‌లో ఎలాగైనా గెల‌వాలి..! అందుకోసం అన్ని శ‌క్తులు ప‌నిచేయాలంటున్న వైసీపి..!!

వ‌చ్చే ఎన్నిక‌లో ఎలాగైనా గెల‌వాలి..! అందుకోసం అన్ని శ‌క్తులు ప‌నిచేయాలంటున్న వైసీపి..!!

ఇప్పటికే తొలి విడుతగా కొన్ని జిల్లాల్లో ఈ సభలు కూడా పూర్తయ్యాయి. మరికొన్నింటిని కూడా త్వరలోనే నిర్వహించడానికి వైసీపీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. పార్టీకి చెందిన ప్రతినిధులతోనే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నా ఎన్నికల ప్రచారంగానే ఇవి కొనసాగుతున్నాయి. వీటి కోసమే ఆ పార్టీ నాయకులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అదే పార్టీకి చెందిన మరో విభాగం నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాయకుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కొద్దిరోజుల కిందట వెల్లడించారు.

టిడిపి చేతిలో వైసిపి సాక్ష్యం : అడ్డంగా వైసిపి దొరికిపోయింది : చ‌ంద్ర‌బాబు..!టిడిపి చేతిలో వైసిపి సాక్ష్యం : అడ్డంగా వైసిపి దొరికిపోయింది : చ‌ంద్ర‌బాబు..!

 న‌టుడు పృథ్వీ కి కీల‌క బాద్య‌త‌లు..! ప్ర‌చార స‌న్నాహాలు చేస్తున్న అదిష్టానం..!!

న‌టుడు పృథ్వీ కి కీల‌క బాద్య‌త‌లు..! ప్ర‌చార స‌న్నాహాలు చేస్తున్న అదిష్టానం..!!

ఇప్పటి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహించిన ప్రముఖ సినీ నటుడు పృథ్వీ రాజ్‌కు సుముచిత స్థానం ఇచ్చారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ప్రజాసంకల్ప యాత్ర సమయంలో వైసీపీలో చేరిన పృథ్వీని వైసీపీ అధినేత ఆదేశాల ప్రకారం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. దీంతో ఆయన యాక్షన్‌లోకి దిగారు. పృథ్వీరాజ్‌తో పాటు జయసుధ, భానుచందర్, కృష్ణుడు, పోసాని కృష్ణమురళీ సహా మిగిలిన సినిమా వాళ్లతో త్వరలో సరికొత్త కార్యక్రమం ప్రారంభించబోతుందట వైసీపీ అధిష్ఠానం.

వైసీపిలోకి పోటెత్తిన తార‌లు..! ఫ్యాన్ గుర్తును ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకే..!!

వైసీపిలోకి పోటెత్తిన తార‌లు..! ఫ్యాన్ గుర్తును ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకే..!!

ఇందులో భాగంగానే సినీ నటులు జోగినాయుడు, మదుసుధ, జయశ్రీ, పద్మరేఖ, ఆశ, ప్రిద్విక, మీనాక్షి, తేజస్విని వైసీపీ కండువా కప్పుకున్నారు. వీరంతా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ తెలిపారు. ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబుపై రాసిన పాటలను వినిపిస్తామ‌ని. ప్రముఖ నటుడు భానుచందర్, కృష్ణుడు, పోసాని కృష్ణ మురళి తో పాటు చాలా మంది టీవీ కళకారులు, మహిళలను తీసుకుని ప్రతి గ్రామానికి వెళ్తామ‌ని ప్రుద్వీ తెలిపారు. ఇందులో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామ‌ని వెల్లడించారు. వైసీపిలో చేరిన సినిమా తార‌లు కొద్ది రోజుల్లో వారికి కేటాయించిన ప‌నులు ప్రారంభిస్తార‌ని అన్నారు.

English summary
YSR Congress Party chief Jaganmohan Reddy is planning to win the next election. Wants to campaign in all the districts in Andhra Pradesh on the name 'Samarasakhikharavam'. Jagan's intention to use a movie stars in the election campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X