• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పీవీపీ పై బండ్ల గణేష్ దౌర్జన్యం: టెంపర్ సినిమా వివాదం: జగన్ కు బండ్ల వేడుకోలు..!

|
  PVP Gives Police Complaint On Bandla Ganesh || పీవీపీ పై బండ్ల గణేష్ దౌర్జన్యం

  సినీ నిర్మాత బండ్ల గణేష్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. వైసీపీ నేత..సహ నిర్మాత పీవీపీ పైన దౌర్జన్యం చేసారంటూ ఫిర్యాదు చేసారు. బండ్ల గణేష్‌తో పాటు అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గణేష్‌కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు పీవీపీ ఇంటికి వెళ్లి ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారు. పీవీపీ ఫిర్యాదు మేరకు పోలీసులు 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తనను కాపాడాలని బండ్ల గణేష ట్విట్టర్ ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను అభ్యర్దించారు. పీవీపీ బారి నుండి రక్షించండి అంటూ వేడుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగానే కాకుండా.. సినీ ఇండస్ట్రీలోనూ ఆసక్తి కరంగా మారింి.

  పీపీపీ నివాసానికి వెళ్లిన గణేష్..

  సినీ నిర్మాత బండ్ల గణేష్‌తో పాటు అతని అనుచరులు వైసీపీ నేత..సినీ ప్రొడ్యూసర్ అయిన పీవీపీ ఇంటికి వెళ్లి ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించినటెంపర్ సినిమాకు సంబంధించి సినీ ఫైనాన్షియర్, సహ నిర్మాత పొట్లూరి వరప్రసాద్.. బండ్ల గణేష్‌కు రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టారు. సినిమా విడుదల సమయంలో అసలు మొత్తాన్ని చెల్లించి.. మిగిలిన మొత్తానికి గణేష్ చెక్కులు ఇచ్చారు. మిగిలిన డబ్బును చెల్లించాలంటూ గణేష్‌ను పీవీపీ కోరారు. ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి దాటాక కొంతమంది వ్యక్తులతో కలిసి పీవీపీ నివాసంపై బండ్ల గణేష్‌ మనుషులు బెదిరింపులకు పాల్పడటమే కాకుండా, దౌర్జన్యానికి పాల్పడ్డారు.

  cine producer Bandla Gandesh attack on YCP leader and co producer PVP in Hyderabad last night

  దీనిపై పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 448, 506, రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద బండ్ల గణేష్‌తో పాటు నలుగురిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్‌ పరారీలో ఉన్నాడు. టెంపర్ చిత్రానికి ఇంకా పీవీపీకి రూ 7 కోట్లు రావాలని చెబుతున్నారు. గత కొంతకాలంగా తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని పీవీపీ అడుగుతున్నారు. దీంతో..ఈ వివాదం చోటు చేసుకుంది. దీని పైన కేసులు దర్యాప్తు ప్రారంభించారు.

  జగన్..నన్ను కాపాడండి...

  పరారీలో ఉన్న బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు పోస్టింగ్ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పీవీపీ నుంచి తనను కాపాడాలని కోరారు. గణేష్ పోస్ట్ చేసిన ట్వీట్ లో ..గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారికి... సార్ మమ్మల్ని అందరినీ పివిపి బారి నుంచి కాపాడండి..అంటూ ట్వీట్ చేసారు. దీనికి కొనసాగింపుగా.. జన్న రాజ్యం వచ్చిందని ఆనందంతో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇలాంటి దుర్మార్గుడిగా చేతినుంచి కాపాడండి సార్ అంటూ వేడుకున్నారు. ఓడిపోయిన కేసులు కూడా మళ్లీ డబ్బులు కావాలి అని బెదిరించి మాట్లాడితే... ఆంధ్రప్రదేశ్ నా చేతుల్లో ఉంది మీ అందర్నీ చంపేస్తాను అని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.

  అందరూ ఆంధ్రప్రదేశ్లో అవినీతి లేని పాలన జరుగుతుందని ఆనంద పడుతూ ఉంటే తులసివనంలో గంజాయి మొక్కలు వీరు చేస్తున్న క్రమంలో మీ పార్టీకి నీకు చెడ్డ పేరు వస్తుందని బండ్ల గణేష్ సూచించారు. మీ పేరు చెప్పి చిత్రపరిశ్రమలో అందర్నీ బెదిరిస్తున్నారు దయచేసి కట్టడి చేయండి అంటూ బండ్ల గణేష్ తన ట్వీట్ ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను అభ్యర్దించారు.

  English summary
  cine producer Bandla Gandesh attack on YCP leader and co producer PVP in Hyderabad last night. on PVP complaint police registerd case and searching for Bandla Ganseh. At the same time Bandla Ganesh Requested AP Cm Jagan to resque him from PVP.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X