• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సినిమాటిక్ గా...బురఖా ధరించి వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యువకుడు

By Suvarnaraju
|

విజయవాడ:కొందరు మగాళ్లు ముందు మంచివాళ్లలా నటించి అవకాశం దొరకగానే మహిళల పట్ల మృగాళ్లుగా మారిపోతారని రుజువు చేసే ఉదంతమిది. ఇలాంటి ఘటనల ద్వారా మహిళలు అప్రమప్తమై జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

కృష్ణా జిల్లా పెనుమలూరులో అచ్చం సినిమాటిక్ గా జరిగిన ఘటన మహిళల తస్మాత్ జాగ్రత్త అనే హెచ్చరికలా ఉంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఆ ఘటన వివరాలు ఇవి...పెనమలూరు గ్రామానికి చెందిన ఓ వివాహిత తన కుటుంబంతో పాటు నివసిస్తోంది. రెండు నెలల క్రితం ఈమె ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లోకి గోపి అనే యువకుడు వచ్చాడు. రావడంతోనే ఈమెపై కన్నేసిన ఆ యువకుడు వెంటనే బైటపడకుండా ఆమెని లొంగతీసుకునే ప్రయత్నాలు ఆరంభించాడు.

ఈమె బయటకు వచ్చినప్పుడు అతను కూడా వెంబడించి మాటలు కలపడం, సాయం చేసేందుకు ప్రయత్నించడం, ఈమె పిల్లలను ఎత్తుకొని ముద్దు చేయడం చేస్తున్నాడు. ఆ తరువాత కొద్ది రోజుల్లో మెల్లిగా ఇతడి నిజస్వరూపం బైటపెట్టడం మొదలు పెట్టాడు. ఆమె అంటే ఇష్టమని...తన కోర్కె తీర్చాలని వేధించబం...వెంటబడటం చేస్తున్నాడు.

Cinematic:A young man who sexually harassed House wife in Vijayawada

అతగాడి వేధింపులు ఎక్కువై పోవడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో కుటుంబంతో సహా అక్కడ్నించి వేరే ప్రాంతానికి మకాం మార్చేసింది. అయినా పట్టువదలని గోపి ఆమె ఏ ప్రాంతంలో నివసిస్తుందో తెలుసుకున్నాడు. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా బురఖా ధరించి ఏకంగా ఈమె ఇంట్లోకి ప్రవేశించి వెంటనే తలుపులు మూసి వేశాడు. తన కోర్కె తీర్చాలంటూ ఆమెపై అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు.

దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె పెద్దగా కేకలు పెట్టింది. దీంతో గోపి వెంటనే అక్కడ్నించి పరారయ్యాడు. దీంతో కుటుంబసభ్యుల అండతో బాధితురాలు పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం గోపిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలాంటి వాళ్ల పట్ల మహిళలు అప్రమప్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

అపరిచితుల సాయాన్ని తీసుకోరాదని, వారి ప్రవర్తన విషయంలో ఏమాత్రం అనుమానం కలిగినా వెంటనే కుటుంబ సభ్యలకు తెలియచేయాలని వారి పట్ల హెచ్చరిస్తున్నారు. అప్రమప్తంగా మెలుగుతూ వారి ప్రవర్తన సందేహాస్పదంగా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడవద్దని సూచిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Youngster first acted as a good man with neighbour lady afterthat who has been sexually harassed her. A police case was registered against this youngman who allegedly sexually harassed a housewife in cinematic procedure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more