వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: అమరావతిలో 'సిస్కో' ఏర్పాటుకు సానుకూలత, బాబుతో 'సిస్కో 'సిఈఓ బేటీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ' సిస్కో' తన సేవలను ప్రారంభించేందుకు సంసిద్దతను వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడుకు ఆ కంపెనీ సిఈఓ జాన్ చాంబర్స్ ఈ మేరకు సానుకూలంగా స్పందించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ' సిస్కో' తన సేవలను ప్రారంభించేందుకు సంసిద్దతను వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడుకు ఆ కంపెనీ సిఈఓ జాన్ చాంబర్స్ ఈ మేరకు సానుకూలంగా స్పందించారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులు, మంత్రుల బృందంతో కలిసి అమెరికాలో పర్యటిస్తున్నారు.

అయితే చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనపై వైసీపీ తీవ్రంగా విమర్శలు చేస్తోంది. చంద్రబాబునాయుడు అమెరికా టూర్ లో రాష్ట్రానికి ఒనగూరిందేమీలేదంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది.

అయితే అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిస్కో కంపెనీ సిఈఓతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో సిస్కోతో పాటుగా మరో 30 కంపెనీలకు చెందిన సిఈఓలు కూడ పాల్గొన్నారు.

అమరావతికి సిస్కో

అమరావతికి సిస్కో

సిస్కో కంపెనీ సిఈఓ జాన్ చాంబర్స్ బృందంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు.ఈ మేరకు 30 మంది ఐటీ సిఈఓలను పిలిచి మరీ అల్పాహరవిందు చర్చల్లో బాబు పాల్గొన్నారు. సిస్కో సిఈఓతో చంద్రబాబునాయుడు మూడు పర్యాయాలు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిస్కో సంస్థను ఏర్పాటు చేయడానికి ఆయన సానుకూలంగా స్పందించారు.సిస్కో సిఈఓ అధిపతి జాన్ చాంబర్స్ చంద్రబాబునాయుడు బృందాన్ని స్వయంగా ఆహ్వానించారు. అమరావతిలో సిస్కో ను ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను చంద్రబాబునాయుడు వివరించారు.అయితే సిస్కోను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.

సిస్కో గొప్పతనమిది

సిస్కో గొప్పతనమిది

నెట్ వర్కింగ్ సిస్టమ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా సిస్కో కు పేరుందో. హార్డ్ వేర్, టెలికమ్యూనికేషన్స్ పరికరాలు, ఓపెన్ డీఎక్స్ , వెబ్ ఎక్స్, జాస్పర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ , లోకల్ ఏరియా నెట్ వర్క్ సేవల్లో ప్రపంచంలోనే సిస్కో నెంబర్ వన్ గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సంస్థ కార్యాలయాల్లో 72 వేల మంది పనిచేస్తున్నారు.అమరావతిలో సిస్కో కార్యకలాపాలు ప్రారంభమైతే రాష్ట్ర ఐటీ రంగానికి అది పెద్ద ఊపు ఇస్తోందని సీఎం బృందంలోని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

బాబు బృందానికి సిస్కో ప్రజంటేషన్

బాబు బృందానికి సిస్కో ప్రజంటేషన్

ఈ చర్చలు ఏపీ, భారత్ పట్ల తమకు ఉన్న నిబధ్తతకు అద్దం పడుతాయని సిస్కో సిఈఓ జాన్ ఛాంబర్స్ అభిప్రాయపడ్డారు.అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంటే తమకు అత్యంత గౌరవమని చెప్పారు. ఆధునిక కమ్యూనికేషన్స్, వ్యవస్థ ప్రపంచాన్ని ఏ విధంగా అనుసంధానం చేస్తుందో సీఎం బృందానికి సిస్కో ప్రతినిధులు ప్రత్యేక ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

అమరావతిని కేంద్రంగా చేసుకోవాలని బాబు వినతి

అమరావతిని కేంద్రంగా చేసుకోవాలని బాబు వినతి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సంస్థ ఎగ్జిక్యూటివ్స్ తో తన బోర్డు రూమ్ నుండే సమావేశమయ్యే విధానాన్ని ఛాంబర్స్ సిఎంకు ప్రదర్శించి చూపారు. సిస్కో కార్యకలాపాలకు అమరావతిని కేంద్రంగా చేసుకోవాలని ఛాంబర్స్ ను కోరారు చంద్రబాబు.అయితే దీనికి చాంబర్ సానుకూలంగా స్పందించారు.సీఎం బృందానికి ఆయన అల్పాహరవిందు ఇచ్చారు. సెమీ కండక్టర్ చిప్ తయారీలకు పేరొందిన అఫ్లైయిడ్ మెటీరియల్ సంస్థ ప్రతినిధులతో సీఎం బృందం సమావేశమైంది. రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

English summary
Cisco CEo John chambers green signal for establish their company in Andhra Pradesh state.Andhrapradesh chiefminister Chandrababu naidu delegation met Mr. John. Babu explained resources in Andhra Pradesh for investors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X