• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుమలలో జస్టిస్ రమణ -జగన్ బాబాయి దగ్గరుండి -రెండు సార్లు దర్శనం, 24న సీజేఐ హోదాలో మళ్లీ!

|

భారత అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సీజేఐగా నియమితులైన తర్వాత తొలిసారి తిరుమల ఆలయానికి వచ్చిన ఆయనను ఆలయ అధికారులు సత్కరించారు. ఈనెల 24న సీజేఐగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన మరోసారి తిరుమలకు రానున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

అనూహ్యం: సుప్రీంకోర్టు కొలీజియం గరం గరం -జస్టిస్ రమణకు పదవి దక్కినా భేటీ ఎందుకు? -తొలి మహిళా సీజేఐ!అనూహ్యం: సుప్రీంకోర్టు కొలీజియం గరం గరం -జస్టిస్ రమణకు పదవి దక్కినా భేటీ ఎందుకు? -తొలి మహిళా సీజేఐ!

సతీమణితో కలిసి..

సతీమణితో కలిసి..

సీజేఐగా నియమితులైన జస్టిన్ ఎన్వీ రమణ తన భార్య శివమాలతో కలిసి తిరుమల సందర్శనకు వచ్చారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి విమానంలో తిరుపతికి చేరుకున్న ఆయనకు చిత్తూరు జిల్లా న్యాయమూర్తి, న్యాయాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన తిరుచానూరులోని పద్మావతీ దేవిని దర్శించుకొని, సాయంత్రం కొండపైన తిరుమలలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకున్నారు. అక్కడ టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి బస, దర్శన ఏర్పాట్లు చేశారు. రాత్రి..

రెండు సార్లు దర్శనం..

రెండు సార్లు దర్శనం..

శనివారం రాత్రి నైవేద్య విరామ సమయం తర్వాత జస్టిస్‌ రమణ దంపతులు ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు. ఆదివారం ఉదయం మరోసారి వారు శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ సీఎం జగన్ బాబాయి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, అర్ఛకులు జస్టిస్ రమణకు స్వాగతం పలికి దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం తిరుమల నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. కాగా, ఈ నెల 24న సుప్రీంకోర్టు సీజే హోదాలో జస్టిస్ రమణ మరోసారి శ్రీవారిని దర్శించుకోనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే,

అయినా సరే హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ -అసంపూర్ణంగా సుప్రీంకోర్టు కొలీజియం భేటీ -సీజేఐ బోబ్డే రికార్డుఅయినా సరే హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ -అసంపూర్ణంగా సుప్రీంకోర్టు కొలీజియం భేటీ -సీజేఐ బోబ్డే రికార్డు

  Justice N V Ramana To Be Next CJI, Gets Presidential Assent For His Appointment
  జస్టిస్ రమణకు ఏపీ లాయర్ల అభినందన

  జస్టిస్ రమణకు ఏపీ లాయర్ల అభినందన

  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ ఎన్వీ రమణకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అడ్వకేట్‌ అసోసియేషన్‌ అభినందనలు తెలిపింది. ఇటీవల జరిగిన జనరల్‌ బాడీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశామని అసోసియేషన్‌ కార్యదర్శి పీటా రామన్‌ ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ మోడల్‌ బైలా‌స్ ను స్వీకరించామని, అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వైవీ రవిప్రసాద్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ జీఎల్‌ నాగేశ్వరరావు, సెక్రెటరీ జేయూఎమ్‌వీ ప్రసాద్‌ రాజీనామాలను తిరస్కరించామని, అసోసియేషన్‌ ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని నిర్ణయించామని ప్రకటనలో పేర్కొన్నారు.

  English summary
  Justice NV Ramana, who has been appointed as the Chief Justice of the Supreme Court, visited Tirumala Sri venkateswara swamy. on saturday and Sunday morning, justice ramana offers prayers to lord balaji along with wife. It is learned that he will visit tirumala again in on capacity of CJI. Andhra pradesh high court advocates association congratulates justice ramana for being appointed as CJI.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X