• search
 • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

'వకీల్ సాబ్' ఫ్యాన్స్ మధ్య గొడవ... కత్తితో కానిస్టేబుల్‌పై దాడి... అనంతపురం థియేటర్‌లో రచ్చ...

|

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' మేనియా నడుస్తోంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే మొదటిరోజు షో చూసిన ఫ్యాన్స్ కూడా రెండో రోజు మళ్లీ థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. సాధారణంగా పవన్ సినిమా అంటేనే థియేటర్లలో ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. స్క్రీన్‌పై పేపర్లు విసిరేయడం,ఈలలు,కేకలు... ఇలా నానా హంగామా ఉంటుంది. అయితే ఒక్కోసారి ఈ హంగామా శృతిమించితే గొడవలు కూడా జరుగుతుంటాయి. తాజాగా అనంతపురం జిల్లాలోనూ ఇదే జరిగింది.

గొడవ ఎందుకు జరిగింది...

గొడవ ఎందుకు జరిగింది...

అనంతపురంలోని నార్పలలో ఉన్న శ్రీనివాస డీలక్స్ థియేటర్‌లో వకీల్ సాబ్ సినిమా ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం(ఏప్రిల్ 9) రాత్రి సెకండ్ షో సమయంలో థియేటర్‌లో ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. సినిమా చూస్తున్న సీన అనే వ్యక్తి ఒకరు ఆ ఉత్సాహంలో వాటర్ ప్యాకెట్ పైకి విసిరేశాడు. అది కాస్త ముందు సీట్లో కూర్చున్న వ్యక్తిపై పడి అతని సెల్‌ఫోన్ తడిచిపోయింది. దీంతో అతను సీనతో గొడవకు దిగాడు. నీవల్లే తన సెల్‌ఫోన్ పాడైపోయిందని అన్నాడు.

కానిస్టేబుల్‌పై కత్తితో దాడి...

కానిస్టేబుల్‌పై కత్తితో దాడి...

ఇద్దరి మధ్య మొదలైన ఈ గొడవ ఒకరిపై ఒకరు దాడి చేసుకునేదాకా వెళ్లింది. ఓవైపు సినిమా నడుస్తుండగానే మరోవైపు ఈ ఇద్దరు గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరినీ నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సీన అనే వ్యక్తి పోలీసులపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గొడవపడ్డ ఫ్యాన్స్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

  Vakeel Saab కి అండగా Mega Family ! | Ram Charan | Pawan Kalyan || Oneindia Telugu
  హిట్ టాక్.. వసూళ్ల వర్షం...

  హిట్ టాక్.. వసూళ్ల వర్షం...

  మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన పవన్ కల్యాణ్ సినిమా వకీల్ సాబ్ అన్నిచోట్లా హిట్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాలో పవన్,ప్రకాష్ రాజ్ మధ్య కోర్టు సీన్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. అలాగే థమన్ నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్‌గా చెబుతున్నారు. హిట్ టాక్ రావడంతో వకీల్ సాబ్ వసూళ్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని ఎదురుచూసిన నిర్మాత దిల్ రాజు... ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరడం,సినిమా పెద్ద హిట్ కావడంతో సంతోషంలో మునిగిపోయారు. సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.ఇక ఈ సినిమా బెనిఫిట్ షోలను రద్దు చేయడంతో ఏపీలో పలుచోట్ల అభిమానులు గొడవకు దిగిన సంగతి తెలిసిందే.

  English summary
  A clash erupted between two Pawan Kalyan fans while watching Vakil Saab movie in Srinivasa Deluxe Theater in Narpala, Anantapur. Police entered them to stop the clash but one of the fan attacked a constable with knife,he shifted to hospital.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X