ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి-పవన్ కళ్యాణ్ పేరుతో పార్క్: రెండు వర్గాల రగడ, మరోసారి ఉద్రిక్తత

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంలో శుక్రవారం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారుల సమక్షంలో ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు.

|
Google Oneindia TeluguNews

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంలో శుక్రవారం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారుల సమక్షంలో ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు.

దీంతో కొందరు పోలీసుల పైన రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వెంటనే అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కష్టపడ్డారు.

Clash between two groups for park in West Godavari

కాగా, ఉరదాళ్ళ పాలెంలో రెండు వర్గాల మధ్య గురువారం ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలం విషయంలో ఏర్పడిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారి పరస్పర దాడుల వరకు వచ్చింది.

ఓ వర్గానికి చెందిన వారికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు ఆ గ్రామంలో భారీగా మోహరించారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి పేరుతో పార్కు ఏర్పాటు చేయాలని ఓ వర్గం వారు డిమాండ్ చేశారు. అయితే ఈ డిమాండును మరో వర్గం అడ్డుకుంది. ఇక్కడ మొదలైన వివాదం దాడుల వరకూ వెళ్లింది.

English summary
There is a clashes between two groups at Uradhallapalem in West Godavari district . One group demanded that establish Park with Chiranjeevi, Pawan Kalyan names, opposite group denied this demand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X