విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేవినేని పర్యటనలో వైసీపీ X టీడీపీ, బెజవాడలో...

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పర్యటనలో ఆదివారం ఉద్రిక్తత తలెత్తింది. ఆయన సాగర్ కాలువలను క్షేత్రస్థాయిలో పరిశీలిచేందుకు ప్రకాశం జిల్లాకు వచ్చారు. మార్టూరు మండలం బొల్లాపల్లి వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, సురేష్ మంత్రిని కలిసి పలు సమస్యల పైన వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు.

వారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత తలెత్తింది.

విజయవాడలో ఉద్రిక్తం

Clash between YSRCP and TDP in Minister Devineni tour

కృష్ణా జిల్లా విజయవాడలోని శిఖామణి సెంటర్ వద్ద మాలమహానాడు కార్యాలయం ఏర్పాటు ఉద్రిక్తతకు దారి తీసింది. మాదిగలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో మాల మహానాడు కార్యాలయం ఎలా ఏర్పాటు చేస్తారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి

ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదివారం ఉదయం ఇంద్రకీలాద్రి పైన కొలువై ఉన్న కనకదుర్గమ్మ తల్లిని దర్సించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడ్యాతో మాట్లాడారు. విజయవాలో లలిత కళా అకాడమి ఏర్పాటు చేస్తామని చెప్పారు. జర్నలిస్టులకు త్వరలో హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తామన్నారు.

English summary
Clash between YSRCP and TDP in Minister Devineni's tour
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X