చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏర్పేడు ప్రమాదంలో ట్విస్ట్: లారీని క్లీసర్ నడిపాడా? సీసీటీవి పుటేజీలో దృశ్యాలు

చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్ వెలుగుచూసింది. లారీని డ్రైవర్ కాకుండా క్లీనర్ నడిపాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్విస్ట్ వెలుగుచూసింది. లారీని డ్రైవర్ కాకుండా క్లీనర్ నడిపాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే ఈ విషయమై రవాణాశాఖ, పోలీసు శాఖలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద ఓ లారీ భీభత్సం సృస్టించిన ఘటనలో 15 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అయితే ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా గ్రామస్థులు ఆందోళనకు వచ్చిన సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

cleaner drive lorry, found in cctv footage

అయితే లారీని డ్రైవర్ కాకుండా క్లీనర్ నడిపాడని రవాణాశాఖాధికారులు గుర్తించారు. కడప సమీపంలోని సీసీటివీల్లో లారీని క్లీనర్ నడిపినట్టుగా దృశ్యాలను రవాణాశాఖాధికారులు గుర్తించారు.

అయితే క్లీనర్ లారీని నడిపి ఉండవచ్చని రవాణాశాఖాధికారులు అనుమానిస్తున్నారు. అయితే పోలీసుశాఖ మంత్రి మరో వాదనను ముందుకు తెస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో డ్రైవర్ మినహా మరేవరూ లారీలో లేరని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే కడప సమీపంలో సీసీటీవి కెమెరాల్లో నమోదైన దృశ్యాల ప్రకారంగా ఆ సమయంలో లారీని క్లీనర్ నడిపి ఉండవచ్చని, అయితే ఏర్పేడు సమీపంలోకి వచ్చేసరికి డ్రైవర్ నడుపుతున్నాడా, లేదా క్లీనరే లారీని నడుపుతున్నాడా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

English summary
Transport department officers found that cleaner drive the lorry on that day, they found CCtv footage from kadapa.police searching for evidences.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X