• search
 • Live TV
చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్‌కు గట్టి షాక్: వైసీపీ షరతులు, చంద్రబాబుపై పోటీ చేసిన నేత రాజీనామా, కంటతడి

|
  YSRCP Senior Leader Quits Jagan Party | Oneindia Telugu

  చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చిత్తూరు జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు సుబ్రహ్మణ్య రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ ఓ వైపు పాదయాత్ర చేస్తుండగా మరోవైపు ఆ పార్టీకి కొందరు నేతలు రాజీనామా చేస్తున్నారు.

  ఇటీవలే రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఆ తర్వాత గిడ్డి ఈశ్వరి, మూడు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిలు వైసీపీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా కీలక నేతగా ఉన్న సుబ్రహ్మణ్య రెడ్డి రాజీనామా చేయడం గమనార్హం.

  చంద్రబాబుపై పోటీ చేసిన నేత

  చంద్రబాబుపై పోటీ చేసిన నేత

  సుబ్రహ్మణ్యం రెడ్డి కుప్పం శాసనసభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు పోటీ చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆయన కుప్పం నుంచి మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్నారు.

  టి-టిడిపికి కాపు సెగ!: రిజైన్ చేస్తా.. బాబుకు ఆర్ కృష్ణయ్య షాక్, 'జగన్ దురదృష్టవంతుడు'

  రాజీనామా ప్రకటన

  రాజీనామా ప్రకటన

  కుప్పం మండలం తంబిగానిపల్లెలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం తన మద్దతుదారులు, అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. సుబ్రహ్మణ్య రెడ్డి రాజీనామా చేయడంతో వైసీపీ నేతలు షాక్‌కు గురయ్యాయి.

  నేను అడిగితే ఇవ్వరా: తిరుమలలో రోజా సంచలన వ్యాఖ్యలు, బైక్‌లపై అనుచరుల హడావుడి

  వైయస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో

  వైయస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో

  స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిపురం జడ్పీటీసీగా గెలుపొందిన సుబ్రహ్మణ్యం రెడ్డి అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవిని పొందారు. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీని స్థాపించడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసి జగన్ పక్కన చేరిపోయారు.

  అప్పటి నుంచి స్తబ్దుగా, రాజీనామా చేస్తూ కన్నీటిపర్యంతం

  అప్పటి నుంచి స్తబ్దుగా, రాజీనామా చేస్తూ కన్నీటిపర్యంతం

  అనంతరం నియోజకవర్గ పార్టీ ఇంచార్జిగా కొనసాగారు. 2014 ఎన్నికల్లో కుప్పం శాసనసభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా చంద్రమౌళిని నిలపడంతో సుబ్రహ్మణ్యం రెడ్డి వర్గీయులు స్తబ్దుగా ఉండిపోయారు. కాగా, ఆదివారం రాజీనామాను ప్రకటించిన సుబ్రహ్మణ్యం రెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు.

  2014లో టిక్కెట్ ఇస్తామని చెప్పి, అదే బాధించింది

  2014లో టిక్కెట్ ఇస్తామని చెప్పి, అదే బాధించింది

  2014 ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తానని చెప్పి, చివరకు బీసీ వ్యక్తిని తీసుకు వచ్చి నిలబెట్టినా పార్టీ కోసం పని చేశామని కార్యకర్తలతో జరిగిన భేటీలో సుబ్రహ్మణ్య స్వామి ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. తాను, తన అనుచరులు ఎన్నికల్లో పని చేయలేదని నిందలు వేయడం బాధించిందన్నారు.

  ఆంక్షలు పెట్టారని ఆరోపణ

  ఆంక్షలు పెట్టారని ఆరోపణ

  2019 ఎన్నికల దాకా నియోజకవర్గంలోనే అడుగు పెట్టకూడదని తనకు ఆంక్షలు పెట్టారని వైసీపీ అధిష్టానంపై ఆయన మండిపడ్డారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తన అనుచరులు పలుమార్లు కుప్పం నియోజకవర్గంలో పార్టీలో నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితిని గురించి చెప్పేందుకు ప్రయత్నిస్తే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో మాట్లాడమని పంపించారని చెప్పారు.

  నాకు బాధ కలిగించింది

  నాకు బాధ కలిగించింది

  పెద్దిరెడ్డి ఏనాడూ ఏ విషయమూ మాట్లాడకపోగా తనకు కనీసం ఆహ్వానం కూడా లేకుండా కుప్పం నియోజకవర్గం పర్యటించడం బాధను కలిగించిందని సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారు. నిరంతరం తనకు, తన అనుచరులకు ఎదురువుతున్న అవమానాలు భరించలేక విధిలేని పరిస్థితుల్లో వైసీపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The YSR Congress Party received a jolt in the district, the home turf of Chief Minister N. Chandrababu Naidu, following the resignation of the party’s senior leader and former ZP chairman M. Subramanyam Reddy on Sunday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more