విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మనమే టాప్ ...ఇక ఈజ్ ఆఫ్ లివింగ్:రైతులతో ముఖాముఖిలో సిఎం చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

విజయవాడ:రాష్ట్రంలోని ప్రకృతి రైతులను స్ఫూర్తిగా తీసుకునే తాను ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణా శిబిరానికి సిఎం చంద్రబాబు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ వ్యాపారాన్ని సులభతరంగా చేసేందుకు టెక్నాలజీని అనుసంధానం చేసే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ గా నిలిచామని, భవిష్యత్తులో ప్రపంచంలోనే ఐదు అగ్రదేశాలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో సమానస్థితికి వెళ్లే పరిస్థితికి వస్తున్నామన్నారు. అందుకే ఇప్పుడు టెక్నాలజీ సాయంతో సంతృప్తిగా జీవించే ఈజ్ ఆఫ్ లివింగ్ కి వెళుతున్నామన్నారు.

 టెక్నాలజీ వల్లే...అంతా సాధ్యం

టెక్నాలజీ వల్లే...అంతా సాధ్యం

ఆర్టీజిఎస్ టెక్నాలజీ వల్ల ప్రభుత్వం అమలు చేసే ఏ పధకమైనా ఎక్కడా ఒక్క పైసా అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సవ్యంగా ప్రజలకు అందేలా చేస్తున్నామని,
పథకాల అమలు విషయమై తానే స్వయంగా ఫోన్ చేసి అడిగినప్పుడు ఎక్కడైనా సమస్య ఉంటే చెబితే వెంటనే రియల్ టైమ్ లో కరెక్ట్ చేయడం జరుగుతోందని, ఇదే ఈజ్ ఆఫ్ లివింగ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.

 రైతులు డాక్టర్లు...దేవుళ్లు

రైతులు డాక్టర్లు...దేవుళ్లు

ఎపిలో టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది తానేనని, ఫలితంగా నేడు అమెరికాలో సైతం తెలుగువాళ్లు ఆ దేశస్తుల కన్నా ఎక్కువ సంపాదించే పరిస్థితిలోకి వచ్చారని చంద్రబాబు చెప్పారు. సమాజానికి ఆరోగ్య మిచ్చే డాక్టర్లు ఈ రైతు దేవుళ్లని...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆనంద రాష్ట్రంగా, ఆరోగ్య రాష్ట్రంగా తీర్చిదిద్దగలిగే శక్తి మీకే ఉందన్నారు చంద్రబాబు. రైతులు పండించే పంటల్లో నాణ్యత ఉంటే ప్రపంచంలో ఏ దేశానికైనా మార్కెట్ చేసే బాధ్యతను తానే తీసుకుంటానని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.

 ఆ ప్రామిస్...మీరే నెరవేర్చాలి

ఆ ప్రామిస్...మీరే నెరవేర్చాలి

ప్రస్తుతం పర్యావరణమే అన్ని సమస్యలకు కారణం అని...పర్యావరణాన్ని నేడు మనం కాపాడితే భవిష్యత్తులో అదే మనల్ని కాపాడుతుందని అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శంగా ఉంటుందని తాను ఐక్యరాజ్యసమితిలో హామీ ఇచ్చానో అది మీ వల్లనే సాధ్యం అన్నారు. ప్రభుత్వ సహకారంతో ప్రకృతి వ్యవసాయాన్ని అత్యుత్తమ ప్రమాణాలతో చేసినట్లయితే తాను చేసిన ప్రామిస్ నెరవేరుతుందన్నారు.

అప్పటికి...నూరుశాతం సాధించాలి

అంతకుముందు తృణ ధాన్యాలతో తయారు చేసిన కేక్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కట్ చేశారు. జెడ్‌బీఎన్‌ఎఫ్‌ ఆహార ఉత్పత్తులపై స్టడీ చేసి ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు పెంపొందించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తుండగా 2025-26 నాటికి నూటికి నూరుశాతం జెడ్‌బీఎన్‌ఎఫ్‌ సాగు చేయాలని...చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

English summary
CM Chandrababu Naidu has explained about ZBNF & it’s benefits in human life at ZBNF Farmers Meeting in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X