వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నా?...క్యారెక్టర్ కాపాడుకోవడం ప్రతి ఒక్కరికి ముఖ్యం:సిఎం చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

అమరావతి:యువతకు చేయూత, దేశానికి భరోసా యువనేస్తమని అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంగళవారం ఉదయం ఉండవల్లిలో 'ముఖ్యమంత్రి యువనేస్తం' పథకాన్ని ప్రారంభించిన సీఎం ఈ కార్యక్రమానికి హాజరైన నిరుద్యోగ యువతతో ముఖాముఖి మాట్లాడారు.

"మనకులం, మనవాడు అనుకుంటే ఎవరూ తిండి పెట్టరు...కేంద్రం మెడలువంచైనా రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకుంటాం...నాపై నమ్మకంతోనే 2014 ఎన్నికల్లో ఓట్లు వేసి ప్రజలు గెలిపించారు...ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నా...క్యారెక్టర్ కాపాడుకోవడం ప్రతి ఒక్కరికి ముఖ్యం...ఏది తప్పు, ఏది ఒప్పు అనేది ఆలోచించాలి. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఆలోచించాలి...నవ్యాంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా నిర్మించడానికి ప్రజల సహకారం అవసరం"..అని సిఎం చంద్రబాబు ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉద్భోధించారు.

CM Chandra Babu launched Mukhyamantri YuvaNestham scheme today

మన దేశానికి యువతే బలమని...

యువశక్తిని ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో 'ముఖ్యమంత్రి యువనేస్తం' పథకానికి రూపకల్పన చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.

యువత శక్తి సామర్థ్యాలను సమర్థవతంగా వినియోగించుకునేందు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని...

ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి కార్యక్రమం లేదని...విజయవంతం కూడ కాలేదని...కానీ ఎపిలో విజయవంతం చేసి తీరుతామన్నారు.

అలాగే 2004లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే సమైక్యాంధ్ర అభివృద్ధిలో ముందంజలో ఉండేదని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. యువతకు చేయూత, దేశానికి భరోసా యువనేస్తమని అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. యువనేస్తం పథకం సమాజానికి ఒక పెద్ద భరోసా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు.

" నన్ను విమర్శించేవాళ్ళు ఏదైనా సాధించారా..?...అని ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు తన విమర్శకులను సూటిగా ప్రశ్నించారు. వాళ్లు దొంగ లెక్కలు రాసుకుని అడ్డంగా దొరికిపోయారు. తండ్రి వైఎస్ హయాంలో ఇష్టానుసారం దొంగ లెక్కలు రాసుకున్నారు. ఏమీ తెలియని వాళ్ళు రోడ్డెక్కి మాట్లాడుతున్నారు"...అని ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు పరోక్షంగా విమర్శించారు.

English summary
Amaravathi:AP CM Chandrababu launched the "Mukyamanthri Yuvanestham" of the much-awaited Unemployed benifit scheme in the in Undavalli on Today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X