• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎపి క్యాబినెట్ లో మార్పులు చేర్పులు?... ఈ వారంలోనే

|

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరగనుందని...అదికూడా అతి త్వరలో...అంటే ఒక వారం రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నుంచి బిజెపి మంత్రులు వైదొలగడంతో ఏర్పడిన ఖాళీ, అలాగే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ఎపి క్యాబినెట్ లో మార్పులు చేర్పులు చేసేందుకు సిఎం సంసిద్దమైనట్లు తెలిసింది. ప్రజెంట్ పొలిటికల్ సినారియో నేపథ్యంలో టిడిపి వాయిస్ ను ధీటుగా వినిపించే సీనియర్ నేతలను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా సమాచారం.

క్యాబినెట్లో...మార్పులు ఎందుకంటే?...

క్యాబినెట్లో...మార్పులు ఎందుకంటే?...

ఇటీవల బిజెపి మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ క్యాబినెట్ నుంచి తప్పుకోవడంతో ఆ రెండు శాఖలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత మంత్రి మాణిక్యాలరావు రాజీనామా చేసిన దేవాదాయ శాఖను రెవిన్యూ మంత్రి కెఈ కృష్ణమార్తికి అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే మరో బిజెపి కామినేని శ్రీనివాస్ రిజైన్ చేసిన వైద్య ఆరోగ్య శాఖ సిఎం చంద్రబాబు వద్దే ఉండగా ఇప్పుడు ఆ శాఖను టిడిపి లోని ఒక సీనియర్ నేతకు అప్పగించనున్నారట.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల కారణంగా తెలుగుదేశం పార్టీ కొంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న క్రమంలో టిడిపి వాయిస్ ను అత్యంత బలంగా వినిపించిగలిగిన, అలాగే ప్రత్యర్థుల విమర్శలను ధీటుగా తిప్పికొట్టగల నాయకుడికి ఈ పదవి అప్పగించాలని సిఎం చంద్రబాబు డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది.

ఆ నేత ఎవరంటే...డాక్టర్ కోడెల!

ఆ నేత ఎవరంటే...డాక్టర్ కోడెల!

ఆ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు అని తెలిసింది. ప్రస్తుతం శాసన సభ స్పీకర్ గా ఉన్న డాక్టర్ కోడెల శివప్రసాదరావును వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా క్యాబినెట్ లోకి తీసుకోవాలని సిఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితుల్లో ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న టిడిపి...రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞుడు, పార్టీ వాయిస్ ను బలంగా వినిపించగల నేత అయిన డాక్టర్ కోడెల మంత్రివర్గంలో ఉంటే బావుంటుందని, ఒక సామాజిక వర్గం నుంచి ఈ ప్రతిపాదన బలంగా వచ్చిందని...దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగానే స్పందిచారని అంటున్నారు. దీంతో ఈ నెల 6 వ తేదీన డాక్టర్ కోడెల ఎపి క్యాబినెట్ చేరే అవకాశం ఉందని తెలిసింది.

డాక్టర్ కోడెల...రాజకీయ ప్రస్థానం...

డాక్టర్ కోడెల...రాజకీయ ప్రస్థానం...

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు అప్పట్లో ఆయన గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆయన దృష్టిలో పడ్డారట. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రోత్సాహంతో 1983లో రాజకీయాల్లోకి వచ్చిన కోడెల అప్పటి ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వరుస విజయాలు నమోదు చేశారు కోడెల శివప్రసాదరావు. గుంటూరు జిల్లా టీడీపీ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన కోడెల 1987లో ఎన్టీఆర్ కేబినెట్లో హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 1995, 1999ల్లో బాబు హయాంలో భారీ నీటిపారుదల, పంచాయితీరాజ్, పౌర సరఫరాల శాఖ, ఆరోగ్యశాఖలను నిర్వహించారు కోడెల శివప్రసాదరావు. 2004, 2009 ఎన్నికల్లో రెండుసార్లు వరుసగా పరాజయం పాలవగా అదే సమయంలో టిడిపి కూడా అధికారానికి దూరమైంది. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తొలి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నుంచి కోడెల పోటీచేసి గెలిచారు. ఆ తరువాత ఎపి శాసనసభ తొలి స్పీకర్ గా నియమించబడ్డ సంగతి తెలిసిందే.

మరి స్పీకర్ ఎవరు...ఎవరంటే?...

మరి స్పీకర్ ఎవరు...ఎవరంటే?...

మరైతే డాక్టర్ కోడెల క్యాబినెట్లో చేరితే అసెంబ్లీ స్పీకర్ గా ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవడం సహజం...ఆ స్థానంలో మరో సీనియర్ నేత, గుంటూరు జిల్లాలో ఓటమి ఎరుగని టిడిపి ఎమ్మెల్యే, పొన్నూరు నియోజకవర్గం శాసన సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర ఎపి అసెంబ్లీ స్పీకర్ గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని తెలిసింది. కోడెల ఎపి స్పీకర్ గా శాసన సభలో టిడిపి పార్టీకి ఏ మేరకు సహకరించగలిగారో...విపక్షాలను కంట్రోల్ చేయగలిగారో...అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధూళిపాళ్ల నరేంద్ర అయితేనే ఆ పదవికి సరిగ్గా సరిపోతారని సిఎం చంద్రబాబు అభిప్రాయమట...కాబట్టి అతి త్వరలో జరగబోయే మార్పుల్లో ఇది కూడా ఒకటంటున్నారు.

ఈ మార్పులేనా...ఇంకా ఏమైనా ఉండొచ్చా?...

ఈ మార్పులేనా...ఇంకా ఏమైనా ఉండొచ్చా?...

క్యాబినెట్ లో ఈ మార్పులేనా...ఇంకా ఏమైనా ఉండొచ్చా అంటే ప్రస్తుతానికి ఈ మార్పులతోనే సరిపెట్టాలని సిఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ దశలో క్యాబినెట్లో భారీ మార్పులు చేర్పులు చేస్తే మళ్లీ అసంతృప్తులు చెలరేగడం...వాటివల్ల కొత్త తలనొప్పులు దేనికని సిఎం చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలిసింది. జలీల్ ఖాన్ ను తొలుత మంత్రి వర్గంలో తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఈ కారణాలతోనే ఆయనకు వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ పదవి ఇచ్చి సర్దుబాటు చేశారని తెలుస్తోంది. అయితే అనూహ్యంగా ముఖ్యమంత్రి వ్యూహం మారితే మరికొన్ని మార్పులు చేర్పులు జరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు.

English summary
Amaravathi:AP CM Chandrababu plans to make changes in AP Cabinet, that this is definitely going to happen within one week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more