• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పోలవరంపై చంద్రబాబు సమీక్ష;ఇంకో 20ఏళ్లయినా ప్రాజెక్ట్ పూర్తయ్యేలా లేదు: రఘువీరా

By Suvarnaraju
|

అమరావతి:పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరంలో పనులను సీఎం చంద్రబాబు లైవ్ ద్వారా పర్యవేక్షించారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తవ్వకాలు,స్పిల్ వే పనులు కొనసాగుతున్నాయని అయితే వర్షాల కారణంగా పనుల్లో వేగం కొంత తగ్గిందని చెప్పారు. గత లక్ష్యాలు అధిగమిస్తూనే...కొత్త లక్ష్యాన్ని చేరుకోవడం సవాలుగా తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. మరోవైపు ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఇంకో 20 ఏళ్లయినా పోలవరం పూర్తయ్యేలా కనిపించడంలేదని వ్యాఖ్యానించారు.

CM Chandra Babu reviews progress of Polavaram projects

ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్ పనులపై సమీక్ష జరుపుతానని గతంలో ప్రకటించిన విధంగా సిఎం చంద్రబాబు క్రమం తప్పకుండా ఆ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తూ మాట నిలబెట్టుకుంటున్నారు. సోమవారం అమరావతిలో ఈ ప్రాజెక్ట్ సమీక్షా సమావేశం సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ

గత వారంలో 8.66 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకాల పనులు జరిగాయని తెలిపారు.

అలాగే స్పిల్ వే పనులు 89 వేల క్యూబిక్ మీటర్లకు గాను 87 వేల క్యూ.మీ పనులు జరిగాయన్నారు. అయితే వర్షాలు, వరద నీటి వల్ల స్పిల్ ఛానల్‌లో పనుల వేగం తగ్గిందని చెప్పుకొచ్చారు ఈ సమావేశంలో మంత్రి దేవినేని ఉమ, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అనంతరం సిఎం చంద్రబాబు రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. రిజర్వాయర్ల దగ్గర నిఘా, భద్రతా వ్యవస్థ గట్టిగా ఉండాలన్నారు. గేట్ల నిర్వహణ, సాంకేతిక అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. రాయలసీమలో ఇంకా తక్కువ వర్షపాతం ఉందని, రెండు కోట్ల ఎకరాలకు సాగునీరందించడమే తన లక్ష్యమని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ డిమాండ్‌ను తీర్చే వ్యూహం అమలు చేయాలని, జలవనరుల శాఖలో ప్రత్యేకంగా ఐటీ విభాగం ఏర్పాటు చేయాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మరోవైపు ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ...పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. కానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే...ఇంకో 20 ఏళ్లయినా పోలవరం పూర్తయ్యేలా కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని రఘువీరా డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల ఫలాలు పోలవరం నిర్వాసితులకు అందడంలేదని రఘువీరా ఆరోపించారు. ఈనెల 20 లోపు నిర్వాసితుల సమస్యలపై స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. అలాగే రాఫెల్‌ కుంభకోణానికి వ్యతిరేకంగా ఈనెల 10న కలెక్టరేట్ల ఎదుట కాంగ్రెస్‌ ఆందోళనలు చేపట్టనున్నట్లు రఘువీరా వెల్లడించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amaravathi:AP Chief Minister Nara Chandrababu Naidu on Monday, while reviewing the progress of the Polavaram project work, said that works have slowed down due to rains. On the other hand, APCC president Raghuveera commented that polavaram work will not complete till another 20 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more