విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇక చాలమ్మా ఆపు: మైక్ తీసుకొని పీతల సుజాతకు బాబు షాక్, క్లాస్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: మంత్రి పీతల సుజాతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు క్లాస్ పీకారు. పశ్చమ గోదావరి జిల్లా ఏలూరులో దోమల పైన దండయాత్ర చేపట్టిన సమయంలో మంత్రికి ముఖ్యమంత్రి చురకలు అంటించారు.

సభ సందర్భంగా మంత్రి సుజాత మాట్లాడారు. ఆమె తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మరింత పొగడపోయారు. ఈ సమయంలో చంద్రబాబు మైక్ అందుకొని.. అన్ని మాటలు అవసరం లేదు.. ఆపు, ఇక్కడ ముగ్గుపు పిల్లలు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని, వారితో మాట్లాడించు చాలని చంద్రబాబు క్లాస్ పీకారు.

Peethala Sujatha

కాగా, గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం రాత్రి ఇక్కడి కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో కుటుంబానికి 20 కిలోల బియ్యం, కిలో చక్కెర, కిలో వంట నూనె, కిలో కందిపప్పు ఆదివారం సాయంత్రంలోగా అందించాలని ఆదేశించారు. సోమవారం సాయంత్రంలోగా రైతులకు పరిహారం అందించాలని చెప్పారు.

దెబ్బతిన్న పంటలకు బీమాతోపాటు ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలను అందించాలని వ్యవసాయశాఖ అధికారులను సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

జిల్లాకు 12 మంది ఐఏఎస్‌ అధికారులు, 49 మంది డిప్యూటీ కలెక్టర్లను పంపి వరద ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామన్నారు. హుధుద్ తుపానులో అందించిన సేవలనే ఇక్కడ కూడా అందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశామన్నారు. వరద తీవ్రతకు దెబ్బతిన్న రహదారులు, రైల్వేమార్గాన్ని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు.

English summary
CM Chandrababu class to minister Peethala Sujatha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X