విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

50ఏళ్లు నిండిన గిరిజనులకు పింఛను: చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: 50 ఏళ్లు నిండిన గిరిజనులకు పింఛను ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ప్రకటించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విశాఖ మన్యం కేంద్రం పాడేరులోచంద్రబాబు నాయుడు గురువారం పర్యటించారు. ఆడారిమెట్టలో ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 32 ఏళ్ల కిందట ఎన్టీఆర్ దర్శించిన గ్రామంలో తాను పర్యటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మరుగుదొడ్లు, పింఛను, చంద్రన్న బీమా అందుతున్న తీరుతెన్నులు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు.

 CM chandrababu inaugurates world adivasi day in Paderu

50 ఏళ్లు నిండిన గిరిజనులకు పింఛను ఇస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. గిరిజనులపై ఉన్న ప్రేమతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. గిరిజనుల కోసం తాము చేస్తున్న కృషి చూసి అరకు, పాడేరు ఎమ్మెల్యేలు టీడీపీతో కలిశారని సీఎం వివరించారు.

బాక్సైట్‌పై అప్పుడు రాజశేఖర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు... గిరిజనులకు నష్టం జరుగుతుందనే తాను సీఎం అయ్యాక బాక్సైట్‌ను రద్దు చేశానని తెలిపారు. అనుమతులు పొందినవారు న్యాయస్థానినికి వెళ్లారు, కేంద్ర ప్రభుత్వం నాపై ఒత్తిడి చేసినా ఒప్పుకోలేదని వివరించారు. గిరిజనులకు హాని కలిగించే బాక్సైట్‌ జోలికి వెళ్లనని చంద్రబాబు స్పష్టం చేశారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu inaugurated the World Adivasi Day celebrations in the Adarimetta village of Paderu Mandal in Visakhapatnam district on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X