చరిత్రలో నిలిచిపోయేలా గుర్తుండాలి - చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే మహానాడుకు కడప వేదిక కావాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళగిరి వద్ద ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని ప్రకటించారు. మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించే తొలి మహానాడు కావడంతో భారీ స్థాయిలో చేపట్టాలన్నారు. అనేక సవాళ్లు, సంక్షోభాలను ఎదుర్కొని 2024లో అధికారంలోకి వచ్చామని... ఏడాది కాలంలో అనుకున్న దానికంటే మెరుగైన పాలన అందించామని చంద్రబాబు అన్నారు.

అంతే కాకుండా కడపలో తొలిసారి జరుగుతున్న మహానాడు కావడంతో.. అన్ని ఏర్పాట్లు చక్కగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ క్రమంలోనే రాయలసీమపై టీడీపీకి ఉన్న నిబద్ధతను ముఖ్యమంత్రి స్పష్టంగా పేర్కొన్నారు. ఫ్యాక్షన్ కల్లోలాలను అరికట్టిన ఘనత తమదేనని చెప్పారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, ముచ్చుమర్రి లిఫ్ట్ వంటి నీటి ప్రాజెక్టులను ప్రారంభించి, సాగునీటి సమస్యను పరిష్కరించిన దాఖలాలు తాము అందించామని గుర్తు చేశారు.

cm-chandrababu-meeting-with-party-officials-over-mahanadu-at-kadapa

అనంతపురం జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కరవును అధిగమించామని, రూ.12,000 కోట్లకు పైగా నిధులను రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించామని తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధికి కొప్పర్తి, ఓర్వకల్, కియా ప్రాజెక్టులు ఉదాహరణలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. అలానే ఈ మహానాడు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపనుందని చంద్రబాబు చెప్పారు. హార్టికల్చర్, డెయిరీ, పరిశ్రమల అభివృద్ధి ద్వారా రాయలసీమ రైతులు కోనసీమ రైతుల కంటే మెరుగైన స్థితికి చేరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక మహానాడులో మొదటి రోజు పార్టీ పరమైన అంశాలపై, రెండోరోజు ప్రభుత్వ పరంగా అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించాలన్నారు. మూడో రోజు లక్షలాదిమందితో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఎక్కడ ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మినీ మహానాడును ఈ నెల 18, 19, 20 తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో, 22, 23 తేదీల్లో పార్లమెంట్ల వారీగా నిర్వహించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి అందరికీ అవగాహన కలిగించేలా తీర్మానాలు ఉండాలని చంద్రబాబు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+