వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి సవాల్: పెట్రోల్, డీజిల్‌పై చంద్రబాబు శుభవార్త, బీజేపీ నేత ప్రశంసలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పెట్రోల్, డీజిల్ ధరలపై సోమవారం శుభవార్త తెలిపారు. దీనిపై బీజేపీ శాసన సభాపక్ష నేత విష్ణు కుమార్ రాజు ప్రశంసలు కురిపించారు. ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ సాగింది. విష్ణు, చంద్రబాబుల మధ్య వాడివేడి చర్చ జరిగింది.

Recommended Video

ఏపీ వాహనదారులకు చంద్రబాబు శుభవార్త

చదవండి: భారత్ బంద్ పాక్షికం: చిన్నారి ప్రాణంతీసిన బంద్! పెట్రోల్-డీజిల్‌పై చంద్రబాబు కీలక నిర్ణయం

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని విష్ణు కుమార్ రాజు స్వాగతించారు. వ్యాట్ తగ్గింపు నిర్ణయంపై చంద్రబాబును అభినందిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కూడా విష్ణు అన్నారు.

మంగళవారం నుంచి అమలులోకి

మంగళవారం నుంచి అమలులోకి

కాగా, ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ రూ.4 నుంచి రూ.2 తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పెట్రోల్ పైన రూ.2, డీజిల్ పైన రూ.2 వ్యాట్ తగ్గించింది. వ్యాట్‌ను తగ్గిస్తూ చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వానికి రూ.1120 కోట్ల ఆదాయం తగ్గనుంది. తగ్గిన ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. కేంద్రం కూడా పెట్రోల్ ధరలు తగ్గించాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఆర్థిక కష్టాల్లో ఉన్నా ధరలు తగ్గించాం

ఆర్థిక కష్టాల్లో ఉన్నా ధరలు తగ్గించాం

ఆర్థిక కష్టాల్లో ఉన్నా పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గించామని చంద్రబాబు తెలిపారు. ఈ నిర్ణయం కేంద్రానికి సవాల్ లాంటిదన్నారు. దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం పెట్రో ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు. పెట్రోల్ ధరల తగ్గింపుపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలన్నారు.

భారత్ బంద్‌కు విశేష స్పందన

భారత్ బంద్‌కు విశేష స్పందన

గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుతం చమురు సంస్థలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను అదుపులేకుండా పెంచడం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోందని చంద్రబాబు అన్నారు. ఈ రోజు ప్రతిపక్షాల బంద్‌కు ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందనే ఇందుకు నిదర్శనమన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, బాధ్యతారహిత విధానాలతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అన్ని వర్గాలకు భరించలేని భారంగా మారాయన్నారు. ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ ధరలను తగ్గించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలను తీసుకోలేదని చెప్పారు.

ఇలా ధరలు

ఇలా ధరలు

2014లో క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 105.5 డాలర్లు ఉండగా నేడు కేవలం 72.23 డాలర్లుగా ఉందని, 2014లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 49.60పైసలు ఉంటే నేడు 86.71పైసలకు పెరిగిందని చంద్రబాబు అన్నారు. డీజిల్‌ ధర 2014లో రూ.60.98పైసలు ఉంటే.. నేడు రూ. 79.98లుగా ఉందన్నారు. గతంలో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినా కేంద్రం తగ్గించకుండా అదనపు పన్నులు, సెస్‌ల పేరుతో దోచుకుందని, ఇప్పుడు మాత్రం ముడిచమురు ధరలు పెరిగాయన్న నెపంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నారన్నారు. ఒక విధానమేమీ లేకుండా నిరంకుశంగా కేంద్రం వ్యవహరించడాన్ని అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయన్నారు.

ఖజానాకు రూ.23 లక్షల కోట్లపై చిలుకు నిధులు

ఖజానాకు రూ.23 లక్షల కోట్లపై చిలుకు నిధులు

2014 జూన్‌లో డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం లీటర్‌పై రూ. 3.50 పైసలు ఉండగా, 2017 సెప్టెంబర్‌ నాటికి లీటర్‌పై రూ.17.33 పైసలకు పెంచారని చంద్రబాబు అన్నారు. 2014లో లీటర్‌ పెట్రోల్‌ ధరపై 9.48 పైసలు ఉన్న కేంద్ర ఎక్సైజ్‌ సుంకాన్ని 2018 నాటికి లీటర్‌కు రూ.19.48 పైసలు పెంచారని చెప్పారు. మౌలిక సదుపాయాల సెస్‌ పేరుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.7, డీజిల్‌పై రూ.8లు అదనపు భారాన్ని వసూలు చేస్తున్నారన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు ద్వారా గత నాలుగున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.23లక్షల కోట్ల పైచీలుకు నిధులు సమకూరుతున్నప్పటికీ సామాన్య జనంపై భారం తగ్గించడానికి కేంద్రం చొరవ చూపకపోవడం సరికాదన్నారు.

English summary
The cut in VAT prices will cost the Andhra Pradesh exchequer around Rs 1,120 crore a year, chief minister Chandrababu Naidu told the state assembly on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X