• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కష్టాలున్నా..: కేసీఆర్‌కు పోటీగా చంద్రబాబు(పిక్చర్స్)

By Srinivas
|

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన జరిగిన గత ఏడాది జూన్ నుంచి కొత్త ఫిట్‌మెంట్‌ను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఎప్పటినుంచి నగదు రూపంలో ఇవ్వాలి, మిగిలినది బాండ్ల రూపంలో ఇవ్వాలా? లేక జిపిఎఫ్‌లో జమ చేయాలా? అన్నది త్వరలో నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టీఎన్జీవో ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. ఇది చంద్రబాబు చిక్కుల్లో పడేసిందని భావించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఏపీఎన్జీవోలకు అదేస్థాయిలో ఫిట్మెంట్ ప్రకటించారు.

కాగా, తెలంగాణ సర్ ప్లస్‌లో ఉండగా, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తెలంగాణకు ధీటుగా ఫిట్మెంట్ ప్రకటించడంపై ఏపీఎన్జీవోలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 ఫిట్మెంట్

ఫిట్మెంట్

కొత్త వేతనంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తీపి కబురు చెప్పారు. ఎకాఎకిన 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. రాష్ట్ర విభజన అమలులోకి వచ్చిన 2014 జూన్‌ మాసం నుంచే 43 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేస్తామని చంద్రబాబు తెలిపారు.

 ఫిట్మెంట్

ఫిట్మెంట్

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే కొత్త వేతనాలు నగదు రూపంలో అందుతాయని చెప్పారు. బకాయి మొత్తాన్ని ఏ రూపంలో చెల్లించాలనే అంశాన్ని తర్వాత నిర్ణయిస్తామని తెలిపారు. పదినెలల వేతన బకాయిలను ఒక్కసారిగా ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల్లో జమచేసే పరిస్థితి లేకపోవడంతో బాండ్‌ల రూపంలో ఇచ్చే అవకాశాలున్నాయని సూచన ప్రాయంగా తెలిపారు.

 ఫిట్మెంట్

ఫిట్మెంట్

ఇప్పటికే తెలంగాణ సర్కారు చర్చలు, సాగతీత, బేరసారాలకు తావివ్వకుండా తమ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబూ తమ రాష్ట్ర ఉద్యోగులకు అదే వరం ఇచ్చారు. తీవ్ర ఆర్థిక కష్టాలున్నప్పటికీ... ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు.

 ఫిట్మెంట్

ఫిట్మెంట్

ఉద్యోగులకు 2014 జూన్‌ 2 నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని తెలిపారు. అయితే, ఏ నెల వరకు బకాయిలు జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తారు? ఎప్పటి నుంచి నగదు రూపంలో చెల్లిస్తారు? అనే అంశాన్ని ఆ తర్వాత నిర్ణయిస్తామన్నారు.

 ఫిట్మెంట్

ఫిట్మెంట్

43 శాతం ఫిట్‌మెంట్‌వల్ల ఏటా ఖజానాపై 9284.52 కోట్ల భారం పడుతుందన్నారు. అయితే ఇప్పటికే చెల్లిస్తున్న 27 శాతం మధ్యంతర భృతిని మినహాయిస్తే అదనంగా 3610.80 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఏపీఎన్జీవో, సచివాలయ, ఉపాధ్యాయ సంఘాలకు చెందిన ప్రతినిధులతో సోమవారం మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, పి.నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాసరావు చర్చలు జరిపారు.

 ఫిట్మెంట్

ఫిట్మెంట్

తెలంగాణ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారని, తమకు అంతకంటే తక్కువ ఇవ్వడం భావ్యంకాదని, అది సమంజసంగా కూడా ఉండదని అని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఈ అభిప్రాయంతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులూ ఏకీభవించారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ తదితర అంశాలు చర్చకు వచ్చినా వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

 ఫిట్మెంట్

ఫిట్మెంట్

అత్యంత కీలకమైన ఫిట్‌మెంట్‌పై మాత్రం ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వద్ద విషయం ఖరారైంది. మంత్రులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్‌లతో కలిసి చంద్రబాబు మీడియా ముందుకు వచ్చారు. కొత్త రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పటికీ... ఉద్యోగులను నిరాశపరచకుండా, వారిని సంతృప్తి పరచాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. కొత్త రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నాయని, 59శాతం జనాభా ఉన్న నవ్యాంధ్రకు 48.5శాతం ఆదాయం వచ్చిందని, 41 శాతం ఉన్న తెలంగాణకు 52శాతం ఆదాయం వచ్చిందని, ఇదే విషయాన్ని గతంలో ఢిల్లీలో చెప్పానని చంద్రబాబు తెలిపారు.

 ఫిట్మెంట్

ఫిట్మెంట్

జనవరి వరకూ లెక్కలు చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందని, విభజన బిల్లు సందర్భంగా కూడా రెండు రాష్ట్రాల ఆర్థికంగా సమానమైన స్థితికి వచ్చేదాకా తమకు సహాయం అందించాలని కేంద్రాన్ని కోరాని, ఆదివారం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే విన్నవించుకున్నామన్నారు. ఐనా కేంద్రం నుంచి తగిన సహకారం లభించలేదన్నారు. ఆదాయం పెంచుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మనందరం కష్టపడాలని, ఆదాయాన్ని పెంచాలని, అప్పులు చెల్లించాలని, సంక్షేమమూ చూసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకపోయినప్పటికీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచామని గుర్తు చేశారు. ఉద్యోగుల పట్ల తాము సానుకూలంగా ఉన్నాన్నారు.

English summary
AP Chief Minister Chandrababu Naidu on Monday announced a 43 per cent hike in pay for state government employees. Mr Naidu said the new pay scales with 43 per cent “fitment” would be implemented from June 2, 2014, when bifurcation came into effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X