తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదీ మర్యాద!: చంద్రబాబుకు 'ప్రసాదం' సెంటిమెంట్, ఎక్కడకెళ్లినా వెంటే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను ఎక్కడకు వెళ్లినా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని, శ్రీవారి ఫోటోలను వెంట తీసుకు వెళ్తున్నారు.

|
Google Oneindia TeluguNews

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను ఎక్కడకు వెళ్లినా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని, శ్రీవారి ఫోటోలను వెంట తీసుకు వెళ్తున్నారు. ప్రత్యేకంగా పూజ చేయించిన ప్రసాదం, ఫోటోలను ఆయన తీసుకు వెళ్తున్నారు.

పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లినా, ఢిల్లీలో పెద్దలతో సమావేశమయ్యేందుకు వెళ్లినా చంద్రబాబు తనకు తోడుగా వెంకటేశ్వరుడిని, ప్రసాదాన్ని తీసుకు వెళ్లడానికి కారణం కూడా ఉందట. శ్రీవారి ఆశీస్సులతో ఏ పని తలపెట్టిని విజయవంతమవుతుందని ఆయన అలా చేస్తున్నారంటున్నారు.

జగన్‌కు భారీ షాక్: బొత్స అల్లుడి హవా, కోలగట్ల రాజీనామా, వైసిపి డోంట్ కేర్!జగన్‌కు భారీ షాక్: బొత్స అల్లుడి హవా, కోలగట్ల రాజీనామా, వైసిపి డోంట్ కేర్!

2003లో చంద్రబాబు నాయుడు బాంబు బ్లాస్ట్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అలిపిరి వద్ద జరిగిన ఈ ఘటనలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. శ్రీవారి దయవల్లే తాను బతికి ఉన్నానని ఆయన పదేపదే చెబుతుంటారు.

CM Chandrababu Naidu Sentiment over Tirupati Prasadam

ఇప్పుడు నవ్యాంధ్రలో ఏపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. శ్రీవారు తనకు కలిసి వచ్చిందని చంద్రబాబు భావిస్తున్నారు. శ్రీవారి వల్ల పని దిగ్విజయవంతం కావడంతో పాటు, ఏపీలో చెప్పుకోదగ్గ పుణ్యక్షేత్రం తిరుపతి. ఇది ప్రఖ్యాతి గాంచినది. దీంతో శ్రీవారి ప్రసాదం అందించి, శాలువాతో సత్కరించడం మర్యాదగా ఆయన భావిస్తున్నారట.

ప్రధాని నరేంద్ర మోడీని కలిసినా, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులను కలిసినా, విదేశాలలో పెట్టుబడుల కోసం వెళ్లినా శ్రీవారి ప్రసాదాన్ని ఇవ్వడం సెంటిమెంటుగా మార్చుకున్నారని అంటున్నారు. శ్రీవారి ప్రసాదాన్ని రుచి చూపిస్తూ, వెంకటేశ్వరుడి శాలువాతో సత్కరిస్తున్నారు.

English summary
AP CM Chandrababu Naidu Sentiment over Tirupati Prasadam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X