వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సాక్షి' ఇంత దుర్మార్గమా, తెలంగాణలో ఆంధ్రులను దొంగలంటారా: బాబు, జగన్ సెల్ఫ్‌గోల్

వైసిపి అధినేత జగన్ మీడియా సాక్షిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాక్షిలో కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ ఎడిషన్‌లో వచ్చిన వార్తలపై ధ్వజమెత్తారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసిపి అధినేత జగన్ మీడియా సాక్షిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాక్షిలో కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ ఎడిషన్‌లో వచ్చిన వార్తలపై ధ్వజమెత్తారు.

చదవండి: సినిమా ఎఫెక్ట్: జూ.ఎన్టీఆర్‌కు చంద్రబాబుకు లంకె పెట్టడమా?

ఆంధ్రులు దొంగలంటూ.. తెలంగాణను రెచ్చగొడతారా?

ఆంధ్రులు దొంగలంటూ.. తెలంగాణను రెచ్చగొడతారా?

ఆంధ్రులను నీటి దొంగలగా రాయడం హేయమంటూ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న జగన్ కృష్ణా జలాల విషయంలో తెలంగాణ వాళ్లను రెచ్చగొట్టేలా తన పత్రికలో వార్తలు రాయించడాన్ని ఏపీలో ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు.

Recommended Video

List Came Out : Chandra Babu Naidu Changed AP Cabinet Ministers - Oneindia Telugu
ఇంత దుర్మార్గమా?

ఇంత దుర్మార్గమా?

జగన్‌ రాజకీయం కోసం నీచానికి ఒడిగడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నవారిని ప్రజలే ఛీ కొట్టాలన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు ఇస్తుంటే తెలంగాణలో సాక్షి పత్రిక నీళ్లు దొంగిలిస్తున్నారని రాయడం పరమ దుర్మార్గమని, నీచమన్నారు. వీలైతే సమస్య పరిష్కారానికి తోడ్పడాలి తప్ప తప్పుడు ప్రచారాలతో రాజకీయం చేయడం సరికాదన్నారు.

సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని టిడిపి

సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని టిడిపి

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ జగన్ తీరుపై ఆలోచించాలని చంద్రబాబు సూచించారు. ఇలాంటి దుర్మార్గ రాజకీయాలు చేస్తున్నవారి పట్ల నిరసన తెలియజేయాలన్నారు. రాష్ట్రమంతా నిరసన తెలియజేయాలన్నారు. జగన్ రాజకీయం కోసం సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు.

జగన్ జిల్లాకే నీళ్లివ్వాలనుకుంటే

జగన్ జిల్లాకే నీళ్లివ్వాలనుకుంటే

తెలంగాణ నీళ్లు దొంగిలించి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించుకుపోతున్నామని జగన్ పేపర్లో తెలంగాణలో రాశారని, ఆ వార్తలు ఇక్కడ (ఏపీలో) రాయలేదని, అక్కడ తెలంగాణ వారిని రెచ్చగొట్టడానికి ఇటువంటి రాతలు రాశారని, ఒక రాష్ట్రం నీళ్లు మరో రాష్ట్రం దొంగిలించగలుగుతుందా? అని బాబు అంతకుముందు ప్రశ్నించారు. జగన్ సొంత జిల్లాకు నీరివ్వడానికి మేం ప్రయత్నం చేస్తుంటే ఆయన ఇలాంటి రాతలు రాయించడం ఏమిటి? వీళ్లు అసలు మనుషులేనా? వీరికి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయని నిలదీశారు. కడప, పులివెందులకు నీళ్లు ఇస్తుంటే భరించలేకపోతున్నారన్నారు. 'ఎవరి నీళ్లను ఎవరూ దొంగిలించలేరు. తన వాటా నీటిని తెలంగాణ వాడుకుంటోంది. మన వాటా నీటిని మనం తీసుకుంటున్నాం. తన సొంత ఊరికి నీళ్లు వచ్చినా భరించలేని పరిస్థితికి ప్రతిపక్ష నేత చేరారు. పోతిరెడ్డిపాడు నుంచి గండికోట, చిత్రావతి వరకూ నీటిని తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. దీనిని స్వాగతిస్తారా లేక వ్యతిరేకిస్తారా?" అని చంద్రబాబు అన్నారు.

పార్టీ నేతలకు హితబోధ

పార్టీ నేతలకు హితబోధ

టిడిపిలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, అంకితభావంతో ఉండాలన్నారు. ఎవరికి వాళ్లు ఏది తోస్తే అది మాట్లాడినా, పార్టీని ఇబ్బంది పెట్టే పనులు చేసినా సహించేది లేదన్నారు.

నా దృష్టికి సమస్య తేవాలి

నా దృష్టికి సమస్య తేవాలి

పదవికి రాజీనామా చేస్తానంటూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించడం వల్ల పార్టీపై ప్రతికూల ప్రభావం పడదా? అని విలేకరులు ప్రశ్నిస్తే.. ఒక్క జేసీ అనే కాదని, ఎవరైనా సమస్య ఏదైనా ఉంటే తన దృష్టికి తెస్తే, తాను పరిష్కరిస్తానని, తాను కూడా సమస్యల పరిష్కారానికే ప్రయత్నిస్తున్నానని, రాయలసీమకు నీళ్లివ్వడానికే ఎన్నో ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu spoke about water issue. He lashed out at YSR Congress Party chief YS Jaganmohan Reddy's Sakshi daily for writing against Andhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X