వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒంటిమిట్టలో కల్యాణం: పట్టువస్త్రాలతో బాబు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

కడప: జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీరామచంద్రుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు గవర్నర్ నర్సింహన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలందించగా గవర్నర్ నరసింహన్ ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. నెలరాజు తొంగిచూస్తున్న వేళ సరిగ్గా రాత్రి 9గంటలకు సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికపై సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. కల్యాణం చూసేందుకు వచ్చిన భక్తుల సంఖ్య అంచనాలు మించిపోయింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తుల రామనామ స్మరణతో ఏక శిలానగరం మార్మోగింది.

నిండు పున్నమి చంద్రుడు సమయంలో వేదపండితులు రాజేష్‌శర్మ ఆధ్వర్యంలో వెల్లా దేవాలయ పండితులు వీణా మాధవాచార్యులు, అహోబిలం వేదపండితులు రమేషాచార్యులు, వారి బృందముతో గవర్నర్, ముఖ్యమంత్రి సమక్షంలో మామూలు వివాహాల తరహాలో శ్రీరామచంద్రునికి, సీతమ్మకు శాస్త్రోక్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి అంగరంగ వైభవంగా సీతారామచంద్రుని కళ్యాణం నిర్వహించారు.

కల్యాణోత్సవం

కల్యాణోత్సవం

జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీరామచంద్రుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

కల్యాణోత్సవం

కల్యాణోత్సవం

ఈ వేడుకలకు గవర్నర్ నర్సింహన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.

కల్యాణోత్సవం

కల్యాణోత్సవం

తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలందించగా గవర్నర్ నరసింహన్ ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

కల్యాణోత్సవం

కల్యాణోత్సవం

నెలరాజు తొంగిచూస్తున్న వేళ సరిగ్గా రాత్రి 9గంటలకు సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికపై సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది.

కల్యాణోత్సవం

కల్యాణోత్సవం

కల్యాణం చూసేందుకు వచ్చిన భక్తుల సంఖ్య అంచనాలు మించిపోయింది. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తుల రామనామ స్మరణతో ఏక శిలానగరం మార్మోగింది.

చంద్రబాబు

చంద్రబాబు

ఉదయం నుంచి రాములవారిని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి శివధనుర్భాణాలంకారములో దర్శనమిచ్చి కాంతికోరిక, ఎదుర్కోళ్ల కళ్యాణోత్సవానికి ఆశీనులయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

పుణ్యాహవాచనం, ఆగమశాస్త్ర పద్ధతిలో ప్రక్షాళన చేసి సుగంధ పరిమళ పుష్పాలతో ముందుగానే కళ్యాణానికి ఉపయోగించే వస్తువులను సంప్రోక్షణం చేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

శాస్త్రోక్తంగా కళ్యాణ తంతు ప్రారంభమై గణపతిపూజ, విశ్వహేన పూజ, పుణ్యాహవాచనము, యజ్ఞోపవేతం అనంతరం జీలకర్రా, బెల్లం రాములవారు, సీతమ్మలకు సమర్పించి కళ్యాణ మాంగల్య ధారణం చేయించి భక్తులందరికీ బహిరంగంగా చూపించి బ్రహ్మ ముడితో వివాహ మహోత్సవాన్ని అర్చకులు, సిద్ధాంతులు ఘనంగా నిర్వహించారు.

చంద్రబాబు

చంద్రబాబు

అంతకుమునుపే ప్రభుత్వ లాంఛనాలతో టిటిడి వారు పట్టు వస్త్రాలను అర్చకులు శాస్త్రోక్తంగా స్వాములవారికి సమర్పించి బ్రహ్మ ముడి వేసిన అనంతరం సీతమ్మ నుండి రామచంద్రునికి, రామచంద్రుని నుంచి సీతమ్మకు అర్చకులు తలంబ్రాలు పోయించారు.

గవర్నర్

గవర్నర్

ఈ సందర్భంగా రామనామ పేరుతో శ్రీరామ, రాఘవరామ, జయజయరామ అంటూ కళ్యాణ వేదికపై మారుమ్రోగిపోయింది.

English summary
Governor E.S.L. Narasimhan and Chief Minister N. Chandrababu Naidu presented silk clothes and Mutyala Talambralu on Thursday night to the presiding deities in the 11th Century Sri Kodanda Rama Swamy temple at Vontimitta, in the first official kalyanotsavam post-bifurcation of the State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X