• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'క్రైమ్స్' సవాల్ విసురుతున్నాయి.. వాటిని బ్లాక్ చేయండి: చంద్రబాబు

|

అమరావతి: పోర్న్ సైట్ల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని, ఇకనుంచి ఏపీలో వాటిని బ్లాక్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర శాంతిభద్రతలపై ఎస్పీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దాచేపల్లి లాంటి ఘటన మరొకటి జరగకూడదని అన్నారు. శాంతిభద్రతల పరిస్థితి బాగుంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు.

పోర్న్ వల్లే ఇలాంటి దుస్థితి:

పోర్న్ వల్లే ఇలాంటి దుస్థితి:

చిన్నారులపై బంధువులు, తెలిసినవారే అత్యాచారాలకు పాల్పడుతుండటం హేయం. పోర్న్‌ వీడియోల వల్లే ఇలాంటి దుస్థితి వచ్చింది. టెక్నాలజీని దుర్వినియోగం చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలి.

మహిళలు, బాలికలు, ఎస్సీ ఎస్టీలపై నేరాలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణచి వేయాలి' అని సీఎం అధికారులను ఆదేశించారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని శిక్షించేందుకు పోక్సో చట్ట సవరణ జరిగిందన్న విషయాన్ని జనంలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అత్యాచార కేసులపై సత్వర విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేయాలని సీఎస్‌, డీజీపీని ఆదేశించారు.

కొత్త పుంతలు తొక్కుతునన్న నేరాలు:

కొత్త పుంతలు తొక్కుతునన్న నేరాలు:

కొత్త పుంతలు తొక్కుతున్న నేరాలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ వాటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. బాధితులు సైతం పోలీసులతో ధైర్యంగా అన్యాయాన్ని చెప్పుకునే వాతావరణం కల్పించాలన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ఆధారాలను సేకరించాలని, తద్వారా శిక్షల శాతం పెంచాలని సూచించారు. ఆర్థిక మోసాలు, ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్‌, లైంగిక నేరాలు అదుపులోకి రావాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో అగ్రిగోల్డ్ లాంటి సంస్థలు పుట్టుకొచ్చి ప్రజలను మోసం చేశాయన్నారు.

నేరాలు సవాల్ విసురుతున్నాయి:

నేరాలు సవాల్ విసురుతున్నాయి:

గంజాయి స్మగ్లింగ్‌, చిన్నారులపై అత్యాచారాలు, విజయనగరంలో భర్తను భార్య హత్య చేయించడం లాంటి సంఘటనలు శాంతిభద్రతలకు సవాల్ విసురుతున్నాయని అన్నారు. బెట్టింగ్ మాఫియాను సైతం అణచివేయాలని అన్నారు. విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఈవ్‌ టీజింగ్‌, గంజాయి, డ్రగ్స్‌ లాంటివి చేరకుండా కట్టడి చేయాలని జిల్లాల ఎస్పీలను చంద్రబాబు ఆదేశించారు. తరుచూ దొంగతనాలకు పాల్పడేవారిపై కేడీ షీట్లు ఓపెన్ చేయాలన్నారు.

 సీఎం అసంతృప్తి:

సీఎం అసంతృప్తి:


రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు నేరాల్లో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని సీఎం పరోక్షంగా చెప్పారట. రాజధాని ప్రాంతంలో భూములివ్వని రైతుల పొలాలకు మంట పెట్టిన ఘటన, పోలవరం కుడి కాల్వకు గండి కొట్టిన ఘటన, తాజాగా తిరుపతిలో బైకు తగులబెట్టిన ఘటనల్లో పోలీసులు నిజాలను వెలికితీయలేకపోయారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇకనైనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

English summary
Andhrapradesh CM Chandrababu Naidu ordered to block the porn sites in Andhrapradesh. He said those are the main reason behind rapes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X