వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రిస్మస్ వేడుకలు: కేక్ కట్ చేసిన బాబు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎస్సీలకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను క్రైస్తవులకూ అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో గురువారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జెరూసలేం వెళ్లేందుకు సబ్సిడీ కావాలని క్రైస్తవ సోదరులు కోరుతున్నారని ఆ అంశాన్ని ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుందని, రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడుతామని అన్నారు. రాజకీయంగా, ఆర్ధికంగా బలహీనంగా ఉన్న క్రైస్తవులను అన్నివిధాలా పైకి తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. స్మశాన వాటికలు లేని ప్రాంతాల్లో వాటిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పెళ్లిళ్ల విషయంలోనూ, సర్టిఫికేట్ల సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.

నమ్మకం, జీవితంలో తృప్తి జెరూసలేం ప్రాంతంలో కలుగుతుందని తెలుసుకున్నానని అన్నారు. క్రైస్తవులు జెరూసలేం వెళ్లేందుకు అవసరమైన అంశాలపై అధ్యయనానికి ఒక కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపి మంత్రి రావెల కిశోర్‌బాబు, వారి కుటుంబ సభ్యులు, క్రైస్తవ సంఘం నాయకులు మాజీ మంత్రి కృష్ణయాదవ్, ఎమ్మెల్యే కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే ఎల్ రమణ, ఎంపి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఎస్సీలకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను క్రైస్తవులకూ అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో గురువారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జెరూసలేం వెళ్లేందుకు సబ్సిడీ కావాలని క్రైస్తవ సోదరులు కోరుతున్నారని ఆ అంశాన్ని ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుందని, రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడుతామని అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాజకీయంగా, ఆర్ధికంగా బలహీనంగా ఉన్న క్రైస్తవులను అన్నివిధాలా పైకి తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

స్మశాన వాటికలు లేని ప్రాంతాల్లో వాటిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పెళ్లిళ్ల విషయంలోనూ, సర్టిఫికేట్ల సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

నమ్మకం, జీవితంలో తృప్తి జెరూసలేం ప్రాంతంలో కలుగుతుందని తెలుసుకున్నానని అన్నారు. క్రైస్తవులు జెరూసలేం వెళ్లేందుకు అవసరమైన అంశాలపై అధ్యయనానికి ఒక కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఏపి మంత్రి రావెల కిశోర్‌బాబు, వారి కుటుంబ సభ్యులు, క్రైస్తవ సంఘం నాయకులు మాజీ మంత్రి కృష్ణయాదవ్, ఎమ్మెల్యే కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే ఎల్ రమణ, ఎంపి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
Andhra Pradesh Cheif Minister N Chandrababu Naidu on Thursday participated in X mas celebrations in NTR Trust Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X